మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 మార్చి 2025 (14:51 IST)

రైళ్లల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారు చెల్లించిన ఫైన్ ఎంతో తెలుసా?

indian railway
ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయ రైల్వే కోచ్‌లలో ప్రయాణిస్తారు. వాటిలో ఇంటర్‌సిటీ రైళ్లు, లోకల్ రైళ్లు కూడా ఉన్నాయి. రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించినందుకు గాను భారతీయ పౌరులు జరిమానాల రూపంలో భారీ మొత్తంలో డబ్బు చెల్లించారు.
 
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 2.16 కోట్ల మంది భారతీయులు రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణించారు. ఈ వ్యక్తుల నుండి దాదాపు రూ.562 కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేయబడ్డాయి. భారతీయ రైల్వే కోచ్‌లలో టికెట్ లేకుండా ప్రయాణించినందుకు సగటు కనీస జరిమానా రూ.250. ప్రయాణ దూరం గణనీయంగా ఎక్కువగా ఉంటే ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. 
 
ఇది రైల్వే శాఖ తన పరిపాలనా వ్యవస్థను మెరుగుపర్చేలా కృషి చేస్తుందనే సంకేతంగా చెప్పొచ్చని విశ్లేషకులు అంటున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికుల నియంత్రణ కోసం రైల్వే అధికారులు కఠినమైన తనిఖీలు చేపడుతున్నారు.