శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (18:08 IST)

రాంకీ సంస్థలపై ఐటీ దాడులు.. రూ.300 కోట్ల నల్లధనం

రాంకీ సంస్థలపై ఐటీ దాడుల వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాంకీ గ్రూప్‌లో రూ.300 కోట్ల నల్లధనం వెలికితీసినట్టు కేంద్ర ఆదాయ పన్నుశాఖ వెల్లడించింది.

రూ.1200 కోట్లు కృత్రిమ నష్టం చూపి పన్నులు ఎగ్గొట్టినట్లు నిర్ధారించామని పేర్కొంది. రూ. 300 కోట్ల నల్లధనానికి పన్ను చెల్లించేందుకు.. రాంకీ సంస్థ అంగీకరించినట్లు వెల్లడించింది. 
 
ఈ నెల 6న హైదరాబాద్‌లో రాంకీ సంస్థలపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అక్రమ ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు నిరూపించే.. పలు డాక్యుమెంట్లు ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.

రాంకీ చైర్మన్‌ అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. రాంకీలోని మేజర్ వాటాని సింగపూర్ వ్యక్తులకు అమ్మేశారని, రూ.288 కోట్లకు సంబంధించిన పత్రాలను సంస్థ నాశనం చేసిందని ఐటీ శాఖ తన ప్రకటనలో తెలిపింది.