గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 డిశెంబరు 2023 (22:37 IST)

అగ్రశ్రేణి 200 స్వీయ-నిర్మిత పారిశ్రామికవేత్తల జాబితాను విడుదల చేసిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ ప్రైవేట్ బ్యాంకింగ్- హురున్ ఇండియా

Business
IDFC FIRST ప్రైవేట్ బ్యాంకింగ్ మరియు హురున్ ఇండియాలు 2000 సంవత్సరం తర్వాత స్థాపించబడిన భారతదేశంలోని 200 అత్యంత విలువైన కంపెనీల జాబితా 'IDFC FIRST ప్రైవేట్ హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా 2023' మొదటి ఎడిషన్‌ను విడుదల చేశాయి. ఈ కంపెనీలు వాటి విలువ ప్రకారం ర్యాంక్ చేయబడ్డాయి, లిస్టెడ్ కంపెనీలకు మార్కెట్ క్యాపిటలైజేషన్ మరియు నాన్-లిస్టెడ్ కంపెనీలకు వాల్యుయేషన్‌లుగా నిర్వచించబడ్డాయి. ఈ జాబితాకు చేరుకోవడానికి తుది తేదీ 30 సెప్టెంబర్ 2023. ఈ జాబితా భారతదేశంలో ప్రధాన కార్యాలయం ఉన్న కంపెనీలను మాత్రమే సూచిస్తుంది (ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు మరియు విదేశీ కంపెనీల అనుబంధ సంస్థలు చేర్చబడలేదు).
 
IDFC FIRST బ్యాంక్ హెడ్-వెల్త్ మేనేజ్‌మెంట్ & ప్రైవేట్ బ్యాంకింగ్ శ్రీ వికాస్ శర్మ మాట్లాడుతూ : “'IDFC FIRST ప్రైవేట్ హురున్ ఇండియాస్  టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా 2023' జాబితాలోని టాప్ 200 స్వీయ-నిర్మిత వ్యవస్థాపకులు వివిధ పరిశ్రమలలో విలువైన వ్యాపారాలను సృష్టించిన మొదటి తరం వ్యక్తులను గుర్తిస్తుంది. దేశం యొక్క వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను కొత్త ఎత్తులకు నడిపిస్తున్న భారతదేశం యొక్క దార్శనిక వ్యవస్థాపకులు, వారి అపారమైన ప్రతిభ, ఆవిష్కరణ మరియు విజయాలను జాబితా ప్రదర్శిస్తుంది.  అత్యంత శ్రమతో కూడిన పరిశోధన తర్వాత ఈ జాబితాను రూపొందించిన హురున్ ఇండియాతో  భాగస్వామ్యం చేసుకోవటం ను IDFC FIRST బ్యాంక్‌ ఒక గౌరవంగా భావిస్తోంది" అని అన్నారు .
 
అనాస్ రెహ్మాన్ జునైద్ ఎండి  మరియు చీఫ్ రీసెర్చర్, హురున్ ఇండియా మాట్లాడుతూ : “IDFC FIRST ప్రైవేట్ హురున్ ఇండియాస్  టాప్ 200 సెల్ఫ్-మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా 2023' జాబితాలోని టాప్ 200 స్వీయ-నిర్మిత పారిశ్రామికవేత్తలు వయస్సు సమూహాలు, లింగం మరియు భౌగోళిక పరంగా భారతీయ వ్యవస్థాపకత యొక్క వైవిధ్యతను ప్రదర్శిస్తుంది. జాబితాలో 1/3వ వంతు మంది 40 ఏళ్లలోపు వయస్సు గలవారు మరియు జాబితాలోని పెద్ద వ్యక్తి 80 ఏళ్లు వ్యక్తి . ఈ జాబితాలోని చాలా మంది వ్యవస్థాపకులకు  తమ కంపెనీలను ప్రారంభించడానికి బెంగళూరు అగ్రస్థానంలో ఉందని చెప్పడం ఆసక్తికరంగా ఉంది - ఇది హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌కు పూర్తి విరుద్ధంగా ఉంది, ఈ జాబితాలో ప్రవేశించినవారు బెంగళూరు కంటే ముంబై మరియు న్యూఢిల్లీకి ప్రాధాన్యత ఇచ్చారు ”,  అని అన్నారు. 
 
మెథడాలజీ
'IDFC FIRST ప్రైవేట్ హురున్ ఇండియాస్ టాప్ 200 సెల్ఫ్ మేడ్ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ది మిలీనియా 2023' అనేది భారతదేశంలోని 200 అత్యంత విలువైన కంపెనీలను గుర్తించే ప్రతిష్టాత్మక జాబితా, ఇవన్నీ 2000 సంవత్సరంలో లేదా ఆ తర్వాత స్థాపించబడ్డాయి. ఈ జాబితా ,  ఈ సహస్రాబ్దిలో అత్యంత విలువైన కంపెనీలను విజయవంతంగా నిర్మించి, పెంపొందించుకున్న స్వీయ-నిర్మిత భారతీయ పారిశ్రామికవేత్తల అసాధారణ విజయాల పై  ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది ఈ జాబితా యొక్క ర్యాంకింగ్ వ్యవస్థాపకులు సృష్టించిన ఎంటర్‌ప్రైజెస్ విలువ క్రమంలో ఉంటుంది కానీ  వ్యవస్థాపకుల నికర-విలువ పరంగా మాత్రం కాదు.
 
హురున్ రిపోర్ట్ యొక్క పరిశోధకుల బృందం దేశవ్యాప్తంగా  పర్యటించింది, వ్యవస్థాపకులు, పరిశ్రమ నిపుణులు, పాత్రికేయులు, బ్యాంకర్లు మరియు బహిరంగంగా లభించే డాటా యొక్క ఇతర వనరులతో సమాచారాన్ని సరిపోల్చుకుంది. లిస్టెడ్ కంపెనీలకు, మార్కెట్ క్యాప్ కట్ ఆఫ్ తేదీ నాటికి సంబంధిత కంపెనీల ధరపై ఆధారపడి ఉంటుంది. అన్‌లిస్టెడ్ కంపెనీల కోసం, హురున్ రీసెర్చ్ యొక్క వాల్యుయేషన్ అనేది ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు సేల్స్, ఈ వి టు సేల్స్, ఈ వి టు  ఇబిఐటిడిఎ వంటి ప్రబలంగా ఉన్న పరిశ్రమ గుణిజాలను ఉపయోగించి వాటి లిస్టెడ్ సమానమైన వాటితో పోల్చడంపై ఆధారపడి ఉంటుంది. డిస్కౌంట్ క్యాష్ ఫ్లో మరియు టోబిన్స్ క్యూ వంటి ఇతర పద్ధతులు కూడా ఉపయోగించబడ్డాయి. ఆర్థిక సమాచారం ను తాజాగా అందుబాటులో ఉన్న వార్షిక నివేదికలు లేదా ఆడిట్ చేయబడిన ఆర్థిక నివేదికల నుండి ఉపయోగించడం జరిగింది. 
 
వాల్యుయేషన్‌లలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి, హురున్ పరిశోధన బృందం ముఖ్యమైన నిధుల రౌండ్‌ల ఆధారంగా ఇటీవలి వాల్యుయేషన్‌లపై ఆధారపడింది. అదనంగా, కొన్ని సందర్భాల్లో, మేము సమగ్ర విశ్లేషణను అందించడానికి పెట్టుబడిదారు-నివేదించిన మార్క్‌డౌన్ వాల్యుయేషన్‌లను పరిగణలోకి తీసుకున్నాము.