శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (14:58 IST)

నాలుగు దశాబ్దాలలో గరిష్ట స్థాయికి నిరుద్యోగ రేటు... కారణం మోదీనా?

గత సంవత్సరం నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైన ఏకంగా 45 ఏళ్లలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) సర్వే ప్రకారం నిరుద్యోగ రేటు 2017-2018 ఏడాదికి 6.1గా నమోదైంది. ఇద్దరు నేషనల్ స్టాటిస్టికల్ సభ్యుల మధ్య వివాదం కారణంగా ఇది ఇంకా బహిరంగంగా విడుదల కాలేదు.
 
1972-73 నుండి నిరుద్యోగ డేటాను రికార్డ్ చేయడం జరుగుతోంది, అప్పటి నుండి ఉన్న డేటాతో పోల్చి చూస్తే ఇదే గరిష్టమని తేల్చి చెప్పింది. ఎన్ఎస్ఎస్ఓ సర్వే ప్రకారం 2011-2012లో ఈ నిరుద్యోగ రేటు 2.2గా నమోదైంది. నవంబర్ 2016లో కరెన్సీ నోట్ల డీమానిటైజేషన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన తర్వాత మొదటిసారిగా ఉద్యోగ రేటుపై జరిగిన సర్వే కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ప్రతి ఏడాది అభివృద్ధ శాతం పెరుగుతున్నా కూడా ఉద్యోగాల సంఖ్యను వృద్ధి చేయడంలో మాత్రం మోడీ ప్రభుత్వం విఫలమైందనే చెప్పాలి. ఏటా ఉద్యోగాల్లో చేరుతున్న యువత కంటే ఇళ్లలో మిగిలిపోతున్న యువత శాతం పెరిగిపోతోంది. ఇదే విషయంపై కాంగ్రెస్ ట్విట్టర్‌లో, మోడీ ఐదేళ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి, నిరుద్యోగాన్ని పెంచారని మండిపడ్డారు.