గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (12:55 IST)

విమాన టిక్కెట్ బుక్ చేస్తున్నారా? రూ.2వేలు తగ్గింపు.. ఎలా?

flight
ఇండియన్ రైల్వే టూరిస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐ.ఆర్.సి.టి.సి) వ్యవస్థాపక దినోత్సవం, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విమాన టిక్కెట్ కొనుగోలుపై బంపర్ ఆఫర్ ప్రకటించడం జరిగింది. మూడు రోజుల పాటు ఈ ఆఫర్ కొనసాగనుంది. 
 
ఐ.ఆర్.సి.టి.సి.యన్ వెబ్ సైట్ ద్వారా స్వదేశీ, విదేశాలకు విమాన ప్రయాణం చేయాలంటే టిక్కెట్లను రిజర్వేషన్ చేస్తే సర్వీస్ ఛార్జ్ వుండదు. రిజర్వేషన్ చేసే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై రూ.2వేల వరకు తగ్గింపు వుంటుంది. 
 
తద్వారా రానున్న రోజుల్లో విదేశీ ప్రయాణం సులువు కానుంది. నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడం కోసం విదేశాలకు వెళ్లేందుకు బుక్ చేసుకునే వారికి టికెట్ ఛార్జీ మినహా అదనంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబడవు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మాత్రమేనని ఐఆర్‌సీటీసీ తెలిపింది.