శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (17:53 IST)

ఐఆర్‌సీటీ గోవా ట్రిప్.. రూ.400 చొప్పున వన్డే ప్యాకేజ్

ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీ) ఆధ్వర్యంలో ఒక్కరికి రూ.400 చొప్పున వన్డే ప్యాకేజ్ రూపొందించిన ఐఆర్‌సీటీసీ.. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులను ఒకరోజుపాటు మాత్రం నార్త్ గోవా లేదా దక్షిణ గోవా పర్యటనకు తీసుకెళ్లనుంది. 
 
ఈ రూ.400కు నార్త్ గోవా లేదా సౌత్ గోవాలో పర్యటించే వీలు కల్పిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ఒకవేళ ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించాలనుకునేవారు ఒక్కరికి రూ.600 చొప్పున లభించే టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. 
 
సౌత్ గోవా పర్యటనలో డోనా పాలా, గోవా సైన్స్ మ్యూజియం, మిరమర్ బీచ్, కాలా అకాడమి, భగవాన్ మహవీర్ గార్డెన్, పంజిమ్ మార్కెట్, కెసినో పాయింట్, రివర్ బోట్ క్రూయిజ్, ఓల్డ్ గోవా, సెయింట్ కేథరిన్ చాపెల్, వైస్రాయ్ ఆర్క్, ఏఎస్ఐ మ్యూజియం, సెయింట్ అగస్టిన్ ప్రదేశాలు వున్నాయి.
 
ఇత నార్త్ గోవా టూర్ ప్యాకేజ్ విషయానికొస్తే, కండోలిమ్ బీచ్, సెయింట్ ఆంటోనీ చాపెల్, సెయింట్ అలెక్స్ చర్చ్, అగ్వాడా ఫోర్ట్, సింక్వెరిమ్ బీచ్, కలంగూట్ బీచ్, బగా బీచ్, అంజునా బీచ్, చాపోరా ఫోర్ట్, వెగొటర్ బీచ్ వంటి ప్రదేశాలను సందర్శింపచేస్తుననారు