బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 23 జనవరి 2024 (22:51 IST)

గ్లోబల్ ఏరోస్పేస్ సప్లై చైన్‌: హైదరాబాద్‌లో Jeh ఏరోస్పేస్ తయారీ కేంద్రం

Jeh Aerospace launch
ఏరోస్పేస్- డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లో అప్రతిహతంగా దూసుకుపోతోంది Jeh ఏరోస్పేస్. ఇప్పటికే మార్కెట్ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న Jeh ఏరోస్పేస్... మరో మైలురాయిని అందుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ Jeh ఏరో స్పేస్ యొక్క అత్యాధునిక సౌకర్యాల కార్యాలయాన్ని ప్రారంభించారు. 1,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉండే ఈ ప్రదేశం గ్లోబల్ ఏరోస్పేస్ రంగంలో సరికొత్త, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. దీనిద్వారా ఏరో స్పేస్ రంగంలో సప్లై చైన్ నెట్ వర్క్‌ని మరింతగా పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా, తయారీ సౌకర్యాలు, గ్లోబల్ క్వాలిటీ ప్రమాణాలకు అనుగుణంగా లేదా అంతకుమించిన వెటెడ్ సప్లయర్ నెట్‌వర్క్‌‌ల ద్వారా ఏ అండ్ డీ పరిశ్రమకు తయారీ పరిష్కారాలను అందిస్తుంది.
 
హైదరాబాద్ లోని జేసీకే హారిజాన్ ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నటువంటి ఈ అత్యాధునిక కార్యాలయంలో A&D తయారీకి భారతదేశం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది. అంతేకాకుండా US, పశ్చిమ ఐరోపాలో స్థాపించబడిన A&D తయారీ కేంద్రాలకు పోటీగా సమకాలీన డిజిటల్, AI సాంకేతికతను పరిచయం చేస్తుంది. ఈ సదుపాయం మరింత పటిష్టమైన, అనుకూలించదగిన ఏరోస్పేస్ సప్లై చైన్‌ను సృష్టిస్తుంది. ఇండస్ట్రీ యొక్క సామర్థ్యాలు మరియు స్థితిస్థాపకతను పెంపొందించే దిశగా పని చేస్తుంది.
 
ఈ సందర్భంగా Jeh ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు విశాల్ సంఘ్వీ, వెంకటేష్ ముద్రగళ్ల మాట్లాడారు. వారు మాట్లాడుతూ... “ఇవాళ మేము హైదరాబాద్‌లో మా అత్యాధునిక సౌకర్యాన్ని సగర్వంగా ఆవిష్కరించడం ద్వారా Jeh ఏరోస్పేస్ మరో మైలురాయిని అధిగమించినట్లు అయ్యింది. ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీలో విప్లవాత్మక మార్పులకు కోసం మేం చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనం. దీనిద్వారా గ్లోబల్ ఏరోస్పేస్, డిఫెన్స్ సప్లయ్ చైన్‌ను పునర్నిర్మించాలనే మా అంకితభావానికి సరికొత్త నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఉపాధి అవకాశాలు,ఆర్థిక వృద్ధిపై మా వెంచర్ చూపుతున్న ప్రభావాన్ని గుర్తించినందుకు గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వ మంత్రి గారికి మా హృదయపూర్వక అభినందనలు. ఇది ఏరోస్పేస్ తయారీ యొక్క ఆవశ్యకతను పునర్నిర్వచించే ప్రారంభాన్ని సూచిస్తుంది. Jeh ఏరోస్పేస్ ను పరిశ్రమలో ఆవిష్కరణ, శ్రేష్ఠతకు మార్గదర్శకంగా ఉంటుంది అని అన్నారు.
 
ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి, గౌరవనీయులు శ్రీ శ్రీధర బాబు గారు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... “Jeh ఏరోస్పేస్‌ను ప్రారంభించే ఈ మహత్తర సందర్భంలో భాగం కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. విశాల్ మరియు వెంకటేష్ అనే ఇద్దరు గొప్ప వ్యక్తుల అచంచలమైన స్ఫూర్తితో నడిచే వెంచర్. వారి కలలు వారు ఏరోస్పేస్ పరిశ్రమలో గణనీయమైన ఉనికిని నెలకొల్పడానికి దారితీశాయి. భారతదేశ గొప్ప పారిశ్రామికవేత్త JRD టాటా. ఆయన నిక్ నేమ్ Jeh. వీరు కూడా ఈ పేరుని ప్రేరణగా తీసుకున్నారని అనిపిస్తుంది. ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ తయారీలో భారతదేశం యొక్క పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకునే అత్యాధునిక సౌకర్యాన్ని రూపొందించడంలో వారి నిబద్ధతను నేను అభినందిస్తున్నాను. వారి సమర్పణలకు డిమాండ్ మరియు సప్లై చైన్ లో ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించడానికి వారి అంకితభావం అభినందనీయం. మా ప్రభుత్వం సరికొత్త సాంకేతికతల రూపకల్పనకు, ముఖ్యంగా IT మరియు కీలకమైన రక్షణ అంశాలకు మద్దతు ఇవ్వడంలో దృఢంగా ఉంది. మన రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యాలతో Jeh ఏరోస్పేస్ యొక్క విజన్ ఈ రంగంలో ఆవిష్కరణలు మరియు వృద్ధిని ప్రోత్సహించడంలో మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ సదుపాయం మన రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడటమే కాకుండా పుష్కలమైన ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది అని అన్నారు ఆయన.