శుక్రవారం, 28 నవంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 నవంబరు 2025 (19:21 IST)

కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో

jio simcard
తమ మొబైల్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒక యేడాది కాలపరిమితితో కూడా కూడిన ఈ ప్లాన్ కింద యేడాదికి 912 జీబీల డేటాను అందివ్వనుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ పూర్తి వివరాలను మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. 
 
ఈ ప్లాన్ ధర రూ.3599. ఇందులో కంపెనీ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. రోజుకు 2.5 జీబీ చొప్పున డేటాను అందివ్వనుంది. ఈ ప్లాన్ కింద కంపెనీ చెల్లుబాటయ్యే వ్యవధి వరకు మొత్తం 912.5 జీబీ డేటాను అందిస్తుంది. ఇది వినయోగదారుడి అవసరాలను తీర్చనుంది.
 
అలాగే, అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస‌లను ఉచితంగా పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ కొత్త కనెక్షన్‌తో అందుబాటులో ఉన్న జియో హోం రెండు ఉచిత ట్రయల్స్‌తో సహా అనేక ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జియో హాట్‌స్టార్‌కు మూడు నెలల సబ్  స్క్రిప్షన్ కూడా ఉచితం. ఇకా ఈ ప్లాన్‌లో 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది.