1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 అక్టోబరు 2023 (22:07 IST)

కియా EV డే: EV5తో పాటు మరో రెండు మోడళ్లు విడుదల

Kia EV
కియా కార్పొరేషన్ ఈరోజు కొరియాలో తమ బ్రాండ్ వార్షిక కియా EV డేలో భాగంగా మూడు కొత్త, చిన్న-మధ్య తరహా ఎలక్ట్రిక్ మోడళ్లను ఆవిష్కరించింది, 'EV విప్లవం'కి నాయకత్వం వహించాలనే దాని ప్రతిష్టాత్మక ప్రపంచ వ్యూహాన్ని పునరుద్ఘాటించింది. ఈ సందర్భంగా, బ్రాండ్ 'అందరికీ EVలు' అనే తమ లక్ష్యం వెల్లడించటంతో పాటుగా తమ ఈవీ మోడల్ లైనప్‌ను సైతం విడుదల చేసింది. EV6 మరియు EV9 విడుదలతో ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్‌గా విజయవంతంగా స్థిరపడిన తర్వాత, అది ఇప్పుడు తన మోడల్ లైనప్‌ను మూడు కొత్త చిన్న-మధ్య తరహా ఎలక్ట్రిక్ మోడళ్లతో ఎలా విస్తరింపజేస్తోందో వివరించింది.
 
“EV కొనుగోలు చేసేటప్పుడు సంకోచం కలిగించే సమస్యలకు పరిష్కారాలను అందించడంపై కియా దృష్టి సారించింది. మేము వివిధ ధరల వద్ద పూర్తి స్థాయి EVలను అందించడం ద్వారా కస్టమర్ అంచనాలను అందుకుంటాము. ఛార్జింగ్ సదుపాయాల లభ్యతను మెరుగుపరుస్తాము, ”అని ప్రెసిడెంట్ మరియు సీఈఓ హో సంగ్ సాంగ్ చెప్పారు.
 
“స్థిరమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడం, మా వినియోగదారుల అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము మొత్తం కస్టమర్ ప్రయాణాన్ని డిజిటల్ నుండి ఆఫ్‌లైన్ వరకు ప్రతి చోటా సాధ్యమైనంత ఆనందించేలా చేయాలనుకుంటున్నాము” అని బ్రాండ్ మరియు కస్టమర్ అనుభవ విభాగం హెడ్ చార్లెస్ ర్యూ చెప్పారు. బ్రాండ్ యొక్క లక్ష్యం 2026 నాటికి ఒక మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాల వార్షిక అమ్మకాల లక్ష్యాన్ని సాధించడం మరియు 2030 నాటికి సంవత్సరానికి 1.6 మిలియన్ యూనిట్లకు పెంచడమని చెప్పారు.