శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 మే 2021 (22:14 IST)

కియా మోటార్స్ ఇండియా.. ఇక కియా ఇండియాగా పేరు మార్పు

KIA
దక్షిణ కొరియా ఆటోమేకర్‌ కియా తన కొత్త లోగోను ఇటీవల భారత్‌లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కొత్త బ్రాండింగ్‌ వ్యూహంలో భాగంగా కంపెనీ భారత్‌లో తన పేరును కూడా మార్చుకుంది.

దేశంలో తన పేరును 'కియా మోటార్స్‌ ఇండియా' నుంచి 'కియా ఇండియా'గా అధికారికంగా మార్చుకున్నట్లు వాహన తయారీ సంస్థ కియా సోమవారం తెలిపింది. కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆమోదం పొందిన తర్వాత కంపెనీ.. మోటార్స్‌ అనే పదాన్ని మునుపటి పేరు నుంచి తొలగించింది.
 
ఇప్పటి నుంచి కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో కార్పొరేట్‌ ఐడెంటీ కింద పనిచేస్తుందని కార్ల తయారీ సంస్థ కియా ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌తోని అనంతపూర్‌లో గల ఉత్పత్తి కేంద్రంలో కంపెనీ తన లోగో, పేరును మార్చింది. దశలవారీగా తన డీలర్‌షిప్‌లలో కూడా ఈ మార్పులు చేయనున్నట్లు వెల్లడించింది. భారత మార్కెట్లో నాలుగో అతిపెద్ద కార్ల విక్రయ కంపెనీగా కియా అవతరించింది.