గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 22 జనవరి 2025 (19:24 IST)

ఐఐసి స్టార్ రేటింగ్స్‌లో అత్యున్నత రేటింగ్స్‌ను సాధించిన KLH, KL క్యాంపస్‌లు

KLH
విద్య మంత్రిత్వ శాఖ (MoE) ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (MIC) 2023-24కి సంబంధించి ప్రకటించిన తాజా IIC (ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్) పనితీరు రేటింగ్స్‌లో KLH, KL డీమ్డ్ టు బి యూనివర్శిటీ క్యాంపస్‌లు మరోసారి అద్భుతమైన ప్రదర్శనలను కనబరిచాయి. హైదరాబాద్‌లోని KLH అజీజ్‌నగర్ క్యాంపస్ 3.5-స్టార్ రేటింగ్‌ను సాధించింది, ఇది ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడంలో దాని నిరంతర నిబద్ధతను నొక్కి చెబుతుంది. సృజనాత్మక, వినూత్న ప్రయత్నాల కోసం శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను కొనసాగిస్తూ, KLH అత్యధిక రేటింగ్‌లలో ఈ ఘనత వరుసగా రెండవ సంవత్సరం సాధించింది. KLH ఇంక్యుబేషన్ సెంటర్, ఫ్యాకల్టీ సభ్యులతో కలిసి, విద్యార్థులలో వ్యవస్థాపక ఆలోచనా స్ఫూర్తిని పెంపొందిస్తుంది, ఆలోచన నుండి స్టార్టప్ వరకు ఆవిష్కరణలకు మార్గనిర్దేశం చేస్తుంది.
 
అదే సమయంలో, కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ విజయవాడ క్యాంపస్ వరుసగా 5వ సంవత్సరం 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. సీనియర్ మేనేజ్‌మెంట్ నాయకత్వంలో, KL-CIIE (సెంటర్ ఫర్ ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ఫ్యాకల్టీ సభ్యులు, సిబ్బందితో కలిసి వినూత్న ఆలోచనలు, వ్యవస్థాపక కార్యకలాపాలు వృద్ధి చెందే వాతావరణాన్ని ప్రోత్సహించడానికి స్థిరంగా పని చేస్తున్నారు.
 
కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ ఈ విజయాల పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ "ఈ అద్భుతమైన రేటింగ్‌లు మా అధ్యాపకుల శక్తి సామర్థ్యాలకు, మా విద్యార్థుల వినూత్న స్ఫూర్తికి నిదర్శనం. విద్య, ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో నాయకులుగా, ఈ నిరంతర గుర్తింపు మా విద్యా, వ్యవస్థాపక ప్రయత్నాలు అన్నింటిలోనూ శ్రేష్ఠతను కొనసాగించేందుకు మమ్మల్ని మరింత ప్రేరేపిస్తుంది" అని అన్నారు. రెండు క్యాంపస్‌లలోని ఇంక్యుబేషన్ సెంటర్‌లకు అయన అభినందనలు తెలిపారు. ఆవిష్కరణ, శ్రేష్ఠతను సాధించడంలో తిరుగులేని మద్దతు, సహకారం కీలకంగా ఈ ఉన్నత ప్రమాణాలు ఉన్నాయి.
 
ఈ ప్రశంసలు క్యాంపస్‌లలో బలమైన ఆవిష్కరణ సంస్కృతిని ప్రతిబింబించడమే కాకుండా, సామాజిక పురోగతి, ఆర్థిక వృద్ధిని నడిపించే ప్రతిభ మరియు ఆలోచనలను పెంపొందించడం కొనసాగించడం ను కూడా ప్రోత్సాహిస్తాయి.