గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (16:42 IST)

మరో బ్రాండ్‌కు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్

ntr jr malabar
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమా షూటింగులతో అత్యంత బిజీగా ఉంటున్నారు. మరోవైపు, ఆయన కమర్షియల్ యాడ్స్‌లో నటిస్తున్నారు. ఈ క్రమలో మరో కంపెనీకి ప్రచారకర్తగా నియమితులయ్యారు. ప్రముఖ బంగారు, వజ్ర ఆభరణాల కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యూవెలరీ కంపెనీకి జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 
 
దీనికి సంబంధించి ఓ యాడ్‌ షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ యాడ్‌ను త్వరలోనే రిలీజ్ చేస్తారని తెలిపారు. ఈ యాడ్ షూట్ నుంచి ఓ ఫోటోను తాజాగా రిలీజ్ చేశారు. గతంలోనూ ఎన్టీఆర్ ఓ సారి మలబార్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఈ తెలుగు హీరో భారీ పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం కేఎఫ్‌సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జూనియర్ ఎన్టీఆర్ నియమితులైన విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "దేవర" పేరుతో తెరకెక్కే చిత్రంలో నటిస్తున్నారు. ఇది షూటింగ్ దశలో ఉంది. అలాగే, "కేజీఎఫ్" ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. ఇదికాకుండా బాలీవుడ్ చిత్రం "వార్-2"లో నటించనున్నారు.