బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 డిశెంబరు 2024 (19:18 IST)

ఒక ఏడాదిలో 2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించిన మారుతి సుజుకీ

Maruti Suziki
భారతదేశపు ప్రయాణికుల వాహన పరిశ్రమలో నాయకునిగా ఉన్న మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL), తమ చరిత్రలో మొదటిసారి ఒక క్యాలండర్ సంవత్సరంలో 2 మిలియన్ వాహనాల ఉత్పత్తిని ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో ఈ గణనీయమైన మైలురాయిని సాధించడానికి భారతదేశంలో మారుతి సుజుకీని ఏకైక OEMని చేసింది. ఈ మైలురాయిని చేరడానికి సుజుకీ మోటార్ కార్పొరేషన్ అంతర్జాతీయ ఆటోమొబైల్ తయారీ సదుపాయాలలో మొదటిదిగా మారింది.
 
హర్యాణాలోని మనేశర్ లో కంపెనీ వారి  ఆధునిక తయారీ కేంద్రంలో ఉత్పత్తి శ్రేణి నుండి విడుదలయ్యే 2వ మిలియన్ వాహనం Ertiga. 2 మిలియన్ వాహనాలలో, దాదాపు 60% హర్యాణాలో తయారయ్యాయి. గుజరాత్ లో 40% తయారయ్యాయి. 2024 క్యాలండర్ సంవత్సరంలో Baleno, Fronx, Ertiga, wagonR, Brezzaలు ప్రముఖ 5 తయారీ వాహనాలలో భాగంగా ఉన్నాయి.
 
ఈ గణనీయమైన మైలురాయిని సాధించడం పై, శ్రీ హిసాషి తాకేఉచి, మేనేజింగ్ డైరెక్టర్ & CEO, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, “2 మిలియన్ ల ఉత్పత్తి మైలురాయి అనేది భారతదేశపు తయారీ సంభావ్యతకు, ‘మేక్ ఇన్ ఇండియా‘ చొరవకు మా అంకితభావానికి నిరూపణ. ఈ విజయం ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి, జాతి నిర్మాణంలో మద్దతు చేయడానికి, భారతదేశపు ఆటోమొబొల్ పరిశ్రమను స్వావలంబనగా, అంతర్జాతీయంగా పోటీయుతంగా ప్రోత్సహించడానికి మా సప్లైయర్, డీలర్ భాస్వాములతో పాటు మా నిబద్ధతను చూపిస్తోంది. నిరంతరంగా మద్దతు చేసినందకు, ఈ చారిత్రక ప్రయాణంలో అంతర్భాగంగా ఉన్నందుకు మా కస్టమర్లు, ఉద్యోగులు, వేల్యూ చెయిన్ భాగస్వాములకు మేము హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.”
 
మారుతి సుజుకీ ప్రస్తుతం మూడు తయారీ కేంద్రాలను నిర్వహిస్తోంది: హర్యాణాలో రెండు, ఈ కేంద్రాలకు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.35 మిలియన్ యూనిట్లుగా ఉంది. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్స్ కోసం పెరుగుతున్న డిమాండ్ ను ఊహించి, కంపెనీ తమ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 మిలియన్ యూనిట్లకు విస్తరించడానికి ప్రణాళిక చేసింది. దీని కోసం, ఖర్ ఖోడా, హర్యాణాలో కొత్త గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని స్థాపిస్తోంది. ఖర్ ఖోడా ప్రాంతంలో నిర్మాణపు పని ప్రణాళికకు అనుగుణంగా కొనసాగుతోంది. వార్షిక సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లతో మొదటి ప్లాంట్ 2025లో పని చేస్తుందని ఆశిస్తున్నారు. పూర్తిగా పని చేయడం ప్రారంభమైన తరువాత, ఖర్ ఖోండా కేంద్రంనికి ప్రతి సంవత్సరం 1 మిలియన్ యూనిట్ల ప్రణాళికాబద్ధమైన సామర్థ్యం ఉంటుంది. ఇంకా, మారుతి సుజుకీ సంవత్సరానికి 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యంతో మరొక గ్రీన్ ఫీల్డ్ కేంద్రాన్ని కూడా ప్రణాళిక చేసింది మరియు ఈ కొత్త కేంద్రం కోసం అనుకూలమైన కేంద్రాన్ని గుర్తించే ప్రక్రియలో ఉంది.
 
మేక్ ఇన్ ఇండియాకు ఒక ఆదర్శవంతమైన ఉదాహరణగా, మారుతి సుజుకీ భారతదేశం నుండి మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులలో దాదాపు 40% తోడ్పడుతోంది. గత 3 వరుస సంవత్సరాల కోసం మారుతి సుజుకీ ప్రముఖ ప్యాసింజర్ వాహనం ఎగుమతిదారుగా నిలిచింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాలకు 17 మోడల్స్ ను ఎగుమతి చేస్తుంది.