గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (17:26 IST)

16 ఏళ్లపాటు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన ఆల్టో.. అదిరే రికార్డ్

Alto
మారుతి సుజుకి ఆల్‌టైం బెస్ట్ సెల్లర్ అయిన ఆల్టో మరో మైలు రాయిని అధిగమించి దేశంలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు 40 లక్షల యూనిట్లు విక్రయించి దేశంలోనే అన్ని యూనిట్లు అమ్ముడుపోయిన తొలి కారుగా రికార్డులకెక్కింది. 
 
16 ఏళ్లపాటు బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచి, ఇప్పుడు 40 లక్షల యూనిట్లు అమ్ముడుపోయిన ఏకైక కారుగా నిలిచినందుకు గర్వంగా ఉందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. తొలి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా సరికొత్త భద్రతా ఫీచర్లతో కూడి ఉందని పేర్కొన్నారు.
 
సెప్టెంబరు 2000వ సంవత్సరంలో మారుతి సుజుకి ఈ కారును లాంచ్ చేసింది. ఆ తర్వాత 16 ఏళ్లపాటు ప్రతి ఏడాది భారత్‌లో బెస్ట్ సెల్లింగ్ కారుగా రికార్డులకెక్కింది. ఎంట్రీలెవల్ కారు అయిన ఆల్టో తొలిసారి కారు కొనుగోలు చేసే వారికి మంచి ఆప్షన్‌గా ఖ్యాతికెక్కింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 3 లక్షలు (ఎక్స్ షోరూం) కాగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 4.36 లక్షలు మాత్రమే.