శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 14 డిశెంబరు 2022 (23:21 IST)

భారతదేశంలో మానసిక ఆరోగ్యం చుట్టూ ఉన్న భయాలను పోగొట్టేందుకు ఎంపవర్‌తో భాగస్వామ్యం చేసుకున్న మెడిక్స్‌ గ్లోబల్‌

Medix
అంతర్జాతీయంగా కొవిడ్‌ మహమ్మారి కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా గణనీయంగా పెరగడం ప్రపంచమంతా చూస్తోంది. అంతర్జాతీయ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, మెడిక్స్‌ ఇప్పుడు ప్రభావవంతమైన స్పందనలను ఆరోగ్య అవసరాల కోసం అందిస్తూనే లక్షలాది మంది వినియోగదారులకు 300 మందికి పైగా అంతర్గత ఫిజీషియన్లతో పాటుగా అంతర్జాతీయంగా 4500కు పైగా ప్రపంచ శ్రేణి స్పెషలిస్ట్‌లతో సేవలను అందిస్తుంది. ఈ సంస్ధ ఇప్పుడు ఎంపవర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది. ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కార్యక్రమం ఎంపవర్‌. భారతదేశంలో మానసిక ఆరోగ్య విభాగంలో అగ్రగామి. ఈ సంస్థ తనతో పాటుగా 600 మందికి పైగా అనుభవజ్ఞులైన మానసిక ఆరోగ్య నిపుణును వెంట తీసుకురావడంతో పాటుగా ప్రపంచశ్రేణి, శాస్త్రీయంగా నిరూపితమైన సాంకేతికతలను సైతం అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా 121 మిలియన్‌ల మందిపై సానుకూలంగా ప్రభావం చూపుతుంది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ఎంపవర్‌ మరియు మెడిక్స్‌‌లు సమగ్రమైన, అత్యాధునిక టెక్‌ పరిష్కారాలను అందిస్తూ భారతదేశంలో ఆరోగ్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నాయి.
 
ఎంపవర్‌, మెడిక్స్‌లు భారతదేశంలో మానసిక ఆరోగ్యం పట్ల ఉన్న చర్చను మార్చడంతో పాటుగా సహాయం, మద్దతు కోసం నూతన మార్గాలనూ ప్రోత్సహిస్తుంది. ఈ భాగస్వామ్యం నూతన, సమగ్రమైన విధానంను మానసిక, భావోద్వేగ కౌన్సిలింగ్‌, మెంటార్‌షిప్‌కు తీసుకువస్తుంది. దీనిని ప్రత్యేకంగా భారతీయ యువతను చేరుకునేలా తీర్చిదిద్దారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా మెడిక్స్‌ ఇండియా ఇప్పుడు ఎంపవర్‌ యొక్క మానసిక ఆరోగ్య సేవలను పలు కేర్‌ ప్రోగ్రామ్‌లకు తీసుకువస్తూనే తమ వినియోగదారులు, భాగస్వాములకు వాటిని అందిస్తుంది. వీరిలో భీమా సంస్థలు, కార్పోరేట్‌ ఉద్యోగుల, ఇతర వాటాదారులు ఉన్నారు. వీరు ఎంపవర్‌ క్లీనిక్స్‌కు తగిన ప్రాప్యతను అందిస్తూనే వర్ట్యువల్‌ మెంటల్‌ హెల్త్‌ సేవలను అందిస్తుంది.
 
ఈ భాగస్వామ్యంతో ఎంపవర్‌, నాలెడ్జ్‌ మరియు సర్వీస్‌ భాగస్వామిగా తమ అనుభవాన్ని మానసిక ఆరోగ్య విభాగంలో పలు నిరూపిత మెంటల్‌ హెల్త్‌ పరిష్కారాలు, చికిత్సలను మానసిక ఆరోగ్య మద్దతు కోరుకునే రోగులకు అందిస్తుంది. మెడిక్స్‌ తమతో పాటుగా నాణ్యత హామీ, గోల్‌ సెట్టింగ్‌ వ్యూహాలు, క్లీనికల్‌ మార్గాలు, డిజిటల్‌ మెంటల్‌ మరియు ఫిజికల్‌ ఎస్సెస్‌మెంట్లలో నైపుణ్యం అందిస్తూనే ఫలితాల గణన, ఎనలిటిక్స్‌లో వినూత్నమైన టూల్స్‌ను అందిస్తుంది. తద్వారా భారతదేశంలో ఇప్పటివరకూ మానసిక ఆరోగ్యంను చూస్తోన్న విధానంలో సమూలమైన మార్పును తీసుకురాగలదు.
 
ఈ భాగస్వామ్యం గురించి ఎంపవర్‌ ఫౌండర్‌ మరియు ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ నీరజ బిర్లా మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో మానసిక ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఎంపవర్‌ వెలుగొందుతుంది. ఈ భాగస్వామ్యం మా స్ధానాన్ని స్ధిరీకరించేందుకు మరో ముందడుగుగా నిలువనుంది. వైద్య పరంగా అనారోగ్యంతో ఉన్న వారిలో మానసిక ఆందోళ సమస్యలు అతి సహజంగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే, మానసిక, శారీరక, సామాజిక అంశాలు అంతర్లీనంగా అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఈ కారణం చేత మానసిక, శారీరక ఆరోగ్యం సైతం మొత్తం ఆరోగ్యంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ భాగస్వామ్యం సమగ్రమైన పరిష్కారాలను శారీరక, మానసిక సేవలను ఒకే వేదికపై అందుకోవాలనుకునే రోగులకు అందిస్తుంది. ఈ తరహా భాగస్వామ్యాలు భారతదేశంలో సమగ్రమైన ఆరోగ్య సంరక్షణ నిర్వహణలో నూతన అధ్యాయం సృష్టించనుంది. అదే సమయంలో మానసిక, శారీరక ఆరోగ్యం పరంగా సమాన ప్రాధాన్యతలను సైతం అందిస్తుంది. అలాగే పరిశోధన, ఎంగేజ్‌మెంట్‌, యాక్ససబిలిటీని ప్రోత్సహించి, మానసిక ఆరోగ్యం పట్ల ఉన్న భయాలను పోగొడుతుంది’’అని అన్నారు.
 
‘‘ఎంపవర్‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ రెండు బ్రాండ్ల నడుమ బలీయమైన బంధం మేము చూశాము. ఈ రెండూ ప్రజల జీవితాలపై చక్కటి ప్రభావం చూపాయి’’ అని మెడిక్స్‌ ప్రెసిడెంట్‌-సీఈఓ సైగల్‌ అజ్మాన్‌ అన్నారు. ‘‘మానసిక ఆరోగ్యం అనేది విస్తృత శ్రేణి పరిస్ధితుల సమూహం. ఇది మన ఆలోచనలు, భావాలు, చర్యల తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నేటి యువతరం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుందిప్పుడు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ ఒత్తిడిని అధిగమించడం వీరికి సవాల్‌గా మారుతుంది. మానసిక ఆరోగ్యంతో ముడిపడిఉన్న భయాలను పొగొట్టాలకుంటున్నాము. సంభాషణలను ప్రోత్సహించడంతో పాటుగా చర్చలనూ నిర్వహిస్తున్నాము. అదే సమయంలో ఈ సవాళ్లను అధిగమించేందుకు తగిన సాధనాలనూ అందిస్తున్నాము’’ అని అన్నారు.
 
భారతదేశంలో మానసిక ఆరోగ్యం అతి తీవ్రమైన సమస్యగా మారుతుంది. మరీ ముఖ్యంగా యువతలో! ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం సామాన్య ప్రజలతో పోలిస్తే తీవ్ర మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తులు 10-20 సంవత్సరాల ముందుగానే చనిపోతారు. డెలాయిట్‌ సంస్థ విడుదల చేసిన మెంటల్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌ బీయింగ్‌ ఇన్‌ ద వర్క్‌ప్లేస్‌ అధ్యయరం ప్రకారం, 80% మంది భారతీయ ఉద్యోగులు గత సంవత్సరం మానసిక ఆరోగ్య సమస్య ఉన్నట్లు వెల్లడించారు. ఈ గణాంకాలు ఎలాగున్నా, సామాజిక భయాలు దాదాపు 39% మందిపై ప్రభావం చూపడంతో పాటుగా వారు చికిత్స తీసుకోవడానికి నిరాకరించడానికి కారణమవుతున్నాయి. ఈ భాగస్వామ్యంతో ఎంపవర్‌ మరియు మెడిక్స్‌లు భారతదేశంలో 2023 ప్రారంభం నుంచి మెంటల్‌ హెల్త్‌ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురానున్నాయి.