సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 7 జూన్ 2024 (19:30 IST)

కాబోయే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీ కటారు రవి కుమార్ రెడ్డి

Kataru Ravi Kumar Reddy Congratulates Chief Minister-Designate Sri Nara Chandrababu Naidu
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ మరియు యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ సిఎండి శ్రీ కటారు రవి కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి- తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఈ మర్యాదపూర్వక సమావేశ సమయంలో, శ్రీ నాయుడు అద్భుతమైన విజయం సాధించినందుకు శ్రీ రవి కుమార్ అభినందించారు. అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో సన్నిహితంగా పని చేయడంతో పాటుగా ప్రధాన పరిశ్రమలలో అవకాశాలను అన్వేషించడానికి అసోచామ్ నిబద్ధతను ఆయన వెల్లడించారు.
 
శ్రీ కటారు రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ, "శ్రీ నాయుడు నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పారిశ్రామిక వృద్ధిని, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రధాన పరిశ్రమలలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి, రాష్ట్రాభివృద్దికి దోహదపడేందుకు అసోచామ్  ప్రభుత్వంతో సహకరిస్తుంది" అని అన్నారు. 
 
అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ స్టేట్ హెడ్ శ్రీ మచ్చా దినేష్ బాబు, అసోచామ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ రాష్ట్రంలో పారిశ్రామిక మరియు వివిధ రంగాల అభివృద్ధికి సాధ్యమైన అన్ని విధాలుగా మద్దతునిస్తుందని వెల్లడించారు.