గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (21:36 IST)

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: రూ.100ల నాణెం విడుదల

NTR Coin
NTR Coin
దిగ్గజ సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణెం విడుదల చేయబోతోంది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజిట్ ప్రకారం, పరిమిత-సరఫరా నాణెం 44 ఎంఎం వ్యాసం కలిగి ఉంటుంది.

ఎన్టీఆర్ బొమ్మతో కూడిన ఈ వంద రూపాయల నాణెంలో 50 శాతం వెండి, 40శాతం రాగి, 5 శాతం నికెల్, 5శాతం జింక్‌తో తయారు చేయబడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 
 
ఈ నాణెం హిందీ, ఆంగ్ల భాషలలో "Sr NTR 100 సంవత్సరాల వార్షికోత్సవం" అని రాసి ఉంటుంది. ఎన్టీఆర్ బొమ్మతో కూడిన నాణెంతో విడుదల కానుండటం.. ప్రపంచవ్యాప్త తెలుగు సమాజానికి గర్వకారణంగా ఉంటుందని తెలుగు ప్రజలు భావిస్తున్నారు.