సీబీఐలో 5 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. స్టైఫండ్ ఎంతంటే..
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ సంస్థల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ) ఐదు వేల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. సీబీఐలో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం ఈ భారీ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులోభాగంగా, 5 వేల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలని అనుకునే వారి విద్యార్హత డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగివుండాలి. వచ్చే మూడో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ రెండో వారంలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీ నుంచి 141 (విజయవాడ రీజన్‌లో 41, గుంటూరు 60, విశాఖ 40 చొప్పున) ఖాళీల్ని భర్తీ చేయనుండగా.. తెలంగాణలో 106 (హైదరాబాద్ 65, వరంగల్ 41 చొప్పున) భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఈ నెల 20వ తేదీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఏప్రిల్ 3వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంది. ఈ శిక్షణ కాలం ఒక యేడాది పాటు కొనసాగుతోంది. ఈ అప్రెంటిస్‌షిప్‌కు ఎంపికయ్యే వారికి రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, అర్బన్ శాఖల్లో రూ.12 వేలు, మెట్రో నగరాల్లో రూ.15 వేలు చొప్పున స్టైఫండ్ అందజేస్తారు. దీనికితోడు ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఖర్చుల కోసం కొంత మొత్తం ఇస్తారు.
అభ్యర్థుల వయసు మార్చి 31వ తేదీ నాటికి 20 నుంచి 8 యేళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి ఉంటుంది. ఫరీక్ష ఫీజుగా జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.800, వికలాంగులు రూ.400, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు రూ.600 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుకు జీఎస్టీ అదనం. రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఈ తేదీలను తర్వాత వెల్లడిస్తారు. ఈ రాత పరీక్షల్లో అర్హత సాధించే అభ్యర్థులకు ఇంటర్వ్యూ, ఫిట్నెస్, స్థానిక భాషలో ప్రావీణ్యత ఆధారంగా ఎంపకి ప్రక్రియ పూర్తి చేస్తారు.