గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 అక్టోబరు 2023 (19:07 IST)

మహారాష్ట్ర: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు

OLa
OLa
మహారాష్ట్రలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్ధమైన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనంలో మంటలు చెలరేగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఈ నెల 28న పూణెలోని పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోతుండగా.. స్థానికులు పలు వీడియోలు తీశారు. అవి ఇప్పుడు వైరల్‌గా మారాయి. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు కూడా కొన్ని వీడియోల్లో రికార్డయ్యాయి.
 
అయితే ఈ విషయంపై ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ స్పందించింది. వాహనంలో మంటలు చెలరేగడానికి గల కారణాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. 
 
వాహనం బ్యాటరీ సక్రమంగా పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఒరిజినల్ పార్ట్‌లను ఉపయోగించకుండా, బయటి నుంచి ఇతర భాగాలను వాడడమే ఈ ప్రమాదానికి కారణమని ఓలా ఎలక్ట్రిక్ ట్విట్టర్‌లో వివరించింది.