గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీ.వీ.
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (18:31 IST)

తరుణ్ భాస్కర్ దాస్యం, రానా దగ్గుబాటి చిత్రం కీడా కోలా నుంచి డిపిరి డిపిరి పాట విడుదల

keeda kola poster
keeda kola poster
దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్  క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం  ట్రైలర్ ఇటివలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. ఇప్పుడు మేకర్స్ కీడా కోలా మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి డిపిరి డిపిరి పాటని విడుదల చేశారు. ఈ పాటని యూనిక్ స్టయిల్ లో కంపోజ్ చేశారు వివేక్.

వోకల్స్, లిరిక్స్, ఇన్స్ట్రుమెంట్స్, సాంగ్ ప్రోగ్రామింగ్ అన్నీ న్యూ ఏజ్ సౌండింగ్ తో చాలా క్యాచిగా వున్నాయి. భరద్వాజ్ గాలి లిరిక్స్ అందించిన ఈ పాటని హనుమాన్ సిహెచ్ పాడిన విధానం చాలా ఎనర్జిటిక్ వుంది. పాటలో వినిపించిన అరబిక్ ర్యాప్ కూడా అలరించింది.

విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ, ఉపేంద్ర వర్మ ఎడిటర్, ఆశిష్ తేజ పులాల ఆర్ట్ డైరెక్టర్.
కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది