శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2017 (09:04 IST)

కారుంటే గ్యాస్ రాయితీ కట్.. కేంద్రం అడుగులు

వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని పూర్తి రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక రకాల చర్యలు చేపట్టింది.

వంట గ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీని పూర్తి రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక రకాల చర్యలు చేపట్టింది. ముఖ్యంగా, నకిలీ వంట గ్యాస్ కనెక్షన్లను ఏరివేసే చర్యలు చేపట్టి, ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసింది. అంటే గ్యాస్‌కు ఇస్తున్న రాయితీని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తోంది. ఇలా చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 3.6 కోట్ల నకిలీ గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసింది. ఇది తొలిదశ మాత్రమే.
 
ఇక రెండో దశలో కారున్న వాళ్లపై సబ్సిడీ ఎత్తివేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఆర్టీయే కార్యాలయాల నుంచి కారు యజమానుల సమాచారాన్ని తెప్పించారు. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిందా లేదా చూస్తున్నారు. ఈ లెక్కల్లో ఎక్కువ మంది ఆదాయాలు పది లక్షలు దాటినట్లయితే వారికి ఒక్కవేటున గ్యాస్‌ సబ్సిడీని ఎత్తేస్తారు. తమకు అంత ఆదాయం లేదని ఎవరైనా నిరూపించుకుంటే మళ్లీ సబ్సిడీని పునరుద్ధరిస్తారు.