సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 మే 2024 (19:31 IST)

యూపీఐ లావాదేవీల్లో వెనకబడిన పేటీఎం.. కారణం ఇదే..?

Paytm
యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం వెనక్కి తగ్గిపోయింది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో పేటీఎం వాటా 8.4 శాతానికి పడిపోయింది. ఫిబ్రవరిలో ఇది 10.8 శాతం, మార్చిలో 9.13 శాతంగా ఉంది. 
 
యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌ పే, గూగుల్‌ పే హవా కొనసాగుతోంది. మొత్తం యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే 48.8 శాతం మార్కెట్‌ వాటాలో అగ్రస్థానంలో ఉంది. 
 
గూగుల్‌ పే 5,027.3 మిలియన్ల లావాదేవీలు, 37.8 శాతం మార్కెట్‌ వాటాలో రెండో స్థానంలో ఉంది. క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుల కోసం ఉపయోగించే క్రెడ్‌ యాప్‌ నాలుగో స్థానంలో ఉంది. మొదటి నుంచీ యపీఐ చెల్లింపుల విషయంలో ఫోన్‌పే, గూగుల్‌ పే ఆధిపత్యంలో ఉన్నాయి.