మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (08:59 IST)

జనవరి ఒకటి నుంచి ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త రూల్స్... ఏంటవి?

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 
 
డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగాదరుల భద్రతే లక్ష్యంగా గతంలో కష్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే, గత సెప్టెంబరు నుంచి కార్డు టోకనైజేషన్ సర్వీసులపై కూడా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
కార్డు వినియోగదారుల అనుమతితోనే కార్డు డాటా టొకనైజేషన్ ముందుకుసాగాలని అందులో పేర్కొంది. అంటే, యూనిక్ ఆల్గరిథమ్ జనరేటెడ్ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్ చేసేందుకు టోకనైజేషన్ సహకరిస్తుంది. అయితే, ఈ కొత్త మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.