గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 ఫిబ్రవరి 2023 (23:29 IST)

హైదరాబాద్‌లో మొదటి 'గ్యాప్' స్టోర్‌ను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్

Anupama
న‌గ‌రంలోని శ‌ర‌త్ సిటీ మాల్‌లో రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌తో క‌లిసి గ్యాప్‌ త‌న రెండో ఫ్రీ స్టాండింగ్ స్టోర్ ప్రారంభించిన‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ స్టోర్ ఆవిష్క‌ర‌ణ రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌, గ్యాప్‌ ఇంక్‌., మ‌ధ్య దీర్ఘ‌కాల భాగ‌స్వామ్యంలో ఓ స‌రికొత్త మైలురాయి. ఇప్పుడు రిల‌య‌న్స్ రిటైల్ భార‌త‌దేశంలో అన్ని చోట్లా గ్యాప్‌ బ్రాండుకు అధికార రీటైల‌ర్ అవుతుంది. 
 
గ‌త సంవ‌త్స‌రం నుంచి 50కి పైగా గ్యాప్‌షాప్‌-ఇన్-షాప్‌లు తెరిచిన త‌ర్వాత‌.. ముంబై ఇన్ఫినిటీ మాల్‌లో కొత్త గ్యాప్ స్టోర్ తెరిచారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లోని శ‌ర‌త్ సిటీ క్యాపిట‌ల్ మాల్‌లో రెండో స్టోర్ తెర‌వ‌డం.. రెండోద‌శ ప్రారంభానికి సూచిక‌. ఇందులో భాగంగా రాబోయే నెల‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొన్ని ఫ్రీస్టాండింగ్ స్టోర్లు తెరుస్తారు. శ‌ర‌త్ సిటీ కేపిట‌ల్ మాల్‌లోని గ్యాప్‌స్టోర్‌లో డెనిమ్, లోగో ఉత్ప‌త్తులు, ఖాకీలు.. ఇంకా మ‌హిళ‌లు, పురుషులు, పిల్ల‌లు, శిశువుల‌కు కావ‌ల్సిన అన్ని ర‌కాల బ్రాండ్లు దొరుకుతాయి. 
 
“భాగ‌స్వాముల ఆధారిత ప‌ద్ధ‌తి ద్వారా భార‌త‌దేశంలో మా ఉనికిని విస్త‌రించ‌డానికి రిల‌య‌న్స్ రిటైల్ తో భాగ‌స్వామ్యం కుదిరినందుకు ఎంతో ఉద్విగ్నంగా ఉంది. గ్యాప్‌వారి బ్రిక్-అండ్-మోర్టార్ వ్యాపారం విస్త‌రిస్తోంది. ఈ ఫ్రీస్టాండింగ్ స్టోర్ల ప్రారంభంతోను, మ‌ల్టీ-బ్రాండ్ స్టోర్ల‌తోను భార‌తీయ క‌స్ట‌మ‌ర్ల‌కు మ‌రింత చేరువ‌గా వెళ్లి, వాళ్లు ఎక్క‌డ షాపింగ్ చేస్తున్నారో అక్క‌డే వాళ్ల‌ను క‌ల‌వ‌డానికి వీల‌వుతుంది” అని గ్యాప్‌ఇంక్‌.,లో అంత‌ర్జాతీయ, గ్లోబ‌ల్ లైసెన్సింగ్‌, హోల్‌సేల్ విభాగం మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆడ్రియెన్ గెర్నాండ్ అన్నారు. 
 
భార‌త‌దేశంలో గ్యాప్‌స్టోర్‌ను ప్రారంభిస్తున్న సంద‌ర్భంగా రిల‌య‌న్స్ రిటైల్ లిమిటెడ్‌లో ఫ్యాష‌న్‌, లైఫ్‌స్టైల్ విభాగం ప్రెసిడెంట్ మ‌రియు సీఈవో అఖిలేష్ ప్ర‌సాద్ మాట్లాడుతూ, “ఐకానిక్ బ్రాండ్ అయిన గ్యాప్‌ని కొత్త రూపంలో భార‌త‌దేశానికి తీసుకురావడం ఆనందంగా ఉంది. కొత్త గ్యాప్‌స్టోర్లను సందర్శించినప్పుడు, వినియోగదారులు సరికొత్త రిటైల్ గుర్తింపును కనుగొనడమే కాకుండా, స్మార్ట్ ట్రయల్ రూమ్స్, ఎక్స్‌ప్రెస్‌ చెక్-అవుట్, మంచి ధర విలువతో సహా సాంకేతిక-ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పొందుతారు. భారతదేశంలో గ్యాప్‌వారి దీర్ఘకాలిక వృద్ధి ప్రణాళికకు ఫ్రీస్టాండింగ్ స్టోర్లను తెరవడం ఒక ముఖ్యమైన చోదక శక్తి. ఇది మా తెలివైన‌ భారతీయ వినియోగదారులకు ప్రపంచ స్థాయి బ్రాండ్లను, వైవిధ్యమైన షాపింగ్ అనుభవాన్ని తీసుకురావడానికి మాకు మరొక అవకాశాన్ని ఇస్తుంది” అని చెప్పారు.