శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 జూన్ 2021 (21:53 IST)

మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎంతంటే..

రాష్ట్రంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.
 
రాష్ట్రంలో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్రపట్టనివ్వడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల పెట్రోల్​ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటింది.
 
తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.96, డీజిల్‌ రూ.98.01 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.
 
అలాగే విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.76, డీజిల్‌ రూ.97.91 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.22గా ఉంది.