శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 16 డిశెంబరు 2020 (22:54 IST)

సఫోలా తేనె 100% స్వచ్ఛమైనది, స్వచ్ఛత సర్టిఫికెట్‌తో లభిస్తుంది

మీరు వినియోగించే తేనె 100% స్వచ్ఛమైందేనని మీరు కచ్చితంగా చెప్పగలరా? తేనె నాణ్యత గురించి ఇటీవల కాలంలో వినియోగదారుల మనస్సుల్లో ఎన్నో సందేహాలు వచ్చాయి. వినియోగదారుల సందేహాలను నివృత్తి చేసేందుకు అత్యంత విశ్వసనీయ బ్రాండ్లలో ఒకటైన సఫోలా వారు కొనే ప్రతీ ఒక్క బాటిల్ కూడా నాణ్యత యొక్క పూర్తి హామీతో లభించేలా సఫోలా హనీ సర్టిఫికెట్‌ను పొందేలా ప్రోత్సహిస్తోంది.
 
పూర్తిగా భారతీయ తేనె ఉత్పత్తిదారుల నుంచి సేకరించబడి, అత్యాధునిక సాంకేతికతతో కూడిన యూఎస్ఎఫ్ డీఏ నమోదిత ప్లాంట్ తయారు కాబడిన సఫోలా తేనె ఎన్నో కఠినమైన నాణ్యతా పరీక్షలను పూర్తి చేసుకొని వస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)చే నిర్దేశించబడిన ప్రతీ ఒక్క నా ణ్యత పరామితికి అనుగుణంగా ఉంటుంది. సఫోలా హనీ యొక్క ప్రతీ బ్యాచ్ కూడా ఎన్ఎంఆర్ (న్యూక్లియర్ మాగ్నటిక్ రిసొనెన్స్)చే పరీక్షించబడింది అనే గ్యారంటీని సఫోలా అందిస్తుంది.
 
ఈ టెస్ట్ ప్రపంచం లోనే అత్యంత ఆధునిక టెస్టులలో ఒకటి. తేనెలో కల్తీని గుర్తించేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణంగా పరిగణించబడుతోంది. అంతిమ ఉత్పాదనలో ఎలాంటి యాడెడ్ షుగర్ లేదని నిర్ధారించుకునేందుకు ప్యాకేజింగ్ దశలో తేనె పరీక్షించబడుతుంది. సఫోలా హనీ యొక్క ప్రతి బ్యాచ్ కూడా తేనె 100% స్వచ్ఛమని, యాడెడ్ షుగర్స్ లేవని, ఏ విధమైన కల్తీ లేదని నిర్ధారించుకునేందుకు అత్యుత్తమ లేబొరేటరీలలో ఎన్ఎంఆర్ (న్యూక్లియర్ మాగ్నటిక్ రిసొనెన్స్)చే పరీక్షించబడుతుంది.
 
తేనె ప్రాసెసింగ్ మరియు ప్యాకేజింగ్ దశల్లో కలుషితం అయ్యేందుకు అవకాశాలు గణనీయంగా ఉంటాయి. అందుకే అది 100% స్వచ్ఛమని మరియు ఏవిధమైన కల్తీ జరుగలేదని నిర్ధారించుకునేందుకు అంతిమ ఉత్పాదన యొక్క ప్రతీ బ్యాచ్ కూడా పరీక్షించబడాల్సిన అవసరం ఉంటుంది. ఎన్ఎంఆర్ సాంకేతికతతో పరీక్షిం చడం అనేది తేనెలో కల్తీని గుర్తించేందుకు, అథెంటిసిటీకి హామీ ఇచ్చేందుకు మరియు నాణ్యత నియంత్రణకు గాను అంతర్జాతీయంగా కూడా అత్యంత శక్తివంతమైన విధానాల్లో ఒకటిగా గుర్తించబడింది.
 
సఫోలా సర్టిఫికెట్ ఆఫ్ ప్యూరిటీ అనేది ఆహార నాణ్యత మరియు హామీ సర్టిఫికెట్. విక్రయించబడే సఫోలా హనీ ప్రతి బాటిల్ కూడా నాణ్యత మరియు సురక్షితలకు సంబంధించిన అత్యున్నత ప్రమాణాలకు 100 % స్వచ్ఛ మైన తేనెగా, అది ఏవిధంగానూ కల్తీ కాలేదని, యాడెడ్ షుగర్ లేనిదనీ గ్యారంటీ  వినియోగదారులకు ఇవ్వబడుతుంది. తేనె యొక్క రోగనిరోధక శక్తి పెంపుదల గుణాలకి గాను వినియోగదారులు దానిపై ఆసక్తిని అధికంగా కనబరుస్తున్న ఈ సమయంలో స్వచ్ఛత ధ్రువీకరణ మరెంతగానో ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఈ సందర్భంగా మారికో లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఇండియా సేల్స్ మరియు న్యూ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజయ్ మిశ్రా మాట్లాడుతూ, ‘‘సఫోలా హనీ యొక్క ప్రతి బ్యాచ్ కూడా ప్రపంచంలోని అ త్యంత ఆధునిక పరీక్షల్లో ఒకటైన ఎన్ఎంఆర్ (న్యూక్లియర్ మాగ్నటిక్ రిసొనెన్స్)చే అత్యుత్తమ జర్మనీ లేబొ రేటరీలలో పరీక్షించబడుతుంది. పారదర్శకతను మేం విశ్వసిస్తాం మరియు పరీక్ష ప్రక్రియలు మరియు ఫలితాలపై వినియోగదారులకు హామీ ఇవ్వదలిచాం. వినియోగదారులు సఫోలా హనీ సర్టిఫికెట్ ఆఫ్ ప్యూరిటీ పొంద గలిగేలా చేయడం ద్వారా మేము విశ్వసనీయత, నాణ్యతకు హామీ, ప్రజారోగ్య సురక్షితల పట్ల మా కొన సాగుతున్న కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాం’’ అని అన్నారు.
 
బాటిల్ యొక్క బ్యాచ్ నెంబర్ ఇమేజ్‌ను సిఎస్‌సి మారికో డాట్ కామ్‌కి పంపడం ద్వారా వినియోగదారులు సఫోలా హనీ సర్టిఫికెట్ ఆఫ్ ప్యూరిటీని పొందగలుగుతారు. తేనెపట్టు నుంచి ప్యాక్ అయ్యే దాకా సఫోలా హనీ అత్యుత్తమ జర్మనీ లేబొరేటరీలలో నిర్వహించే ఎన్ఎంఆర్ టెస్టింగ్‌తో సహా 60కిపైగా నాణ్యత తనిఖీలకు లోనవుతుంది. వాటికి ఈ సర్టిఫికెట్ హామీ ఇస్తుంది.