మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 ఫిబ్రవరి 2024 (18:21 IST)

హిమాలయాలలో సముద్ర మట్టానికి 4,500 అడుగుల ఎత్తులో అమెజాన్ కస్టమర్ ఆర్డర్‌ల అందజేత

Amazon
ఎగువ హిమాలయాలలో, సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో గజోలిలోని మహర్షి ఆశ్రమం భారతదేశంలోని దాదాపు 60 మంది ధ్యాన అభ్యాసకులకు ప్రశాంతమైన స్వర్గధామం. ఇక్కడి ఆశ్రమంలో ధ్యానాన్ని అభ్యసించేందుకు, అంతర్గత శాంతిని కనుగొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుంటారు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండే ఈ ఆశ్రమం ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి వేరు పడి ఉంటుంది. అభ్యాసకులకు ఇది అనుకూలమైన వాతావరణం అయినప్పటికీ, ఈ ప్రదేశం వారికి రోజువారీ నిత్యావసరాలను పొందడం చాలా సవాలుగా ఉంటుంది.

సమీప పట్టణానికి చేరుకునేందుకు కొండ ప్రాంతాలలోని మార్గాల నుంచి సమీప గ్రామమైన గజోలికి 30-40 నిమిషాల ట్రెక్కింగ్ ఉంటుంది. అక్కడి నుంచి సమీపంలోని ఉత్తరకాశీ పట్టణానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఉంది. ఆశ్రమ ప్రాంతంలో, చుట్టుపక్కల దుకాణాలు లేదా డెలివరీ ఎంపికలు లేకపోవడంతో ఈ ప్రయాణం కష్టతరమైనది మాత్రమే కాకుండా ప్రయాణానికి చాలా సమయం తీసుకుంటుంది. కానీ 2020లో పరిస్థితులు మారిపోయాయి. గజోలి గ్రామంలోని మహర్షి ఆశ్రమానికి డెలివరీ చేసిన మొదటి మరియు ఏకైక ఇ-కామర్స్ కంపెనీగా అమెజాన్ అవతరించింది. ఇది భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచైనా అభ్యాసకులు వస్తువులను ఆర్డర్ చేయగల అవకాశాల ప్రపంచాన్ని తెరవడంతో, వారు తమ ఇంటి వద్దే సరుకులను అందుకున్నారు.
 
అమెజాన్ మార్చి 2019లో డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్ స్టేషన్‌తో ఈ ప్రాంతంలో తన కార్యకలాపాలను ప్రారంభించి ఉత్తరకాశీ, చుట్టుపక్కల ప్రజలకు సేవలు అందించింది. గజోలిలోని మహర్షి ఆశ్రమానికి నిర్దిష్ట ఆవశ్యకతను గుర్తిస్తూ, స్టేషన్ 2020 ప్రారంభంలో ఆశ్రమానికి డెలివరీ చేయడం ప్రారంభించింది. మహర్షి ఆశ్రమంలో డెలివరీ చేస్తున్న ఏకైక ఇ-కామర్స్ కంపెనీగా 4 ఏళ్ల కన్నా ఎక్కువ కాలం కొనసాగడం అమెజాన్‌కు భారత్‌లో ఉన్న వినియోగదారుని అభిరుచికి నిదర్శనం అని చెప్పవచ్చు.
 
డెలివరీ అసోసియేట్‌ల కోసం, ప్రయాణం కేవలం రహదారి మాత్రమే కాదు-ఇది 25-కిలోమీటర్ల బైక్ రైడ్ కోసం అసాధారణమైన పర్వత మార్గాన్ని, ఎత్తైన కొండలు, కొండ చరియలు, పీఠభూములతో కూడిన భూభాగంలో 3 కిలోమీటర్ల ట్రెక్‌ను కలిగి ఉంటుంది. చలికాలం, వర్షాకాలంలో చాలా కష్టంగా మారే ఈ మార్గంలో ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్టనర్‌తో భాగస్వామ్యం అయ్యే వరకు, ఆశ్రమ సిబ్బంది తమ రోజువారీ అవసరాల కోసం ముందుగా ప్లాన్ చేసుకుని ఉత్తరకాశీ లేదా డెహ్రాడూన్‌కు వెళ్లేవారు. కష్టతరమైన భూభాగంలో ఉన్న అడ్డంకులు ఉన్నప్పటికీ, అమెజాన్ గత కొన్నేళ్లుగా, ఈ ప్రాంతంలో వేగవంతమైన డెలివరీలను అందించడంలో తన నిబద్ధతను ప్రదర్శించింది. డెలివరీ అసోసియేట్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని రోజువారీ డెలివరీలు మధ్యాహ్నం 1.00 గంటకు పూర్తవుతాయి.
 
‘‘కస్టమర్ అబ్సెషన్‌ను దృష్టిలో ఉంచుకుని మేము భారతదేశంలో దృఢమైన ఆపరేషన్స్ నెట్‌వర్క్‌ను నిర్మించాము’’ అని అమెజాన్ ఇండియాలో అమెజాన్ లాజిస్టిక్స్ డైరెక్టర్ డాక్టర్ కరుణ శంకర్ పాండే తెలిపారు. “గత కొన్నేళ్లుగా, మేము మా మౌలిక సదుపాయాలు, డెలివరీ సాంకేతికతను మూడు మైళ్లలో గణనీయంగా పెంచాము. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకునేందుకు మా వినియోగదారుల విభిన్న అవసరాలను తీర్చుకునేందుకు వేగవంతమైన, సురక్షితమైన మరియు స్థితిస్థాపకమైన నెట్‌వర్క్‌ను నిర్మించాము. ఉత్తరకాశీలోని సవాళ్లతో కూడిన భూభాగం, ప్రతికూల వాతావరణం రవాణాకు సంప్రదాయకమైన అడ్డంకులు ఉన్నప్పటికీ, ఆశ్రమానికి డెలివరీలను సాధ్యం చేస్తున్న బృందానికి నేను వినయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వినియోగదారులు ఎక్కడున్నా వారికి బట్వాడా చేసే మా సామర్థ్యం మరియు నిబద్ధతను ఇది ఉదహరిస్తుంది’’ అని వివరించారు.
 
డెలివరీ సర్వీస్ పార్టనర్‌గా అమెజాన్‌తో తన ప్రయాణం గురించి రాహుల్ కేసర్ మాట్లాడుతూ, “అమెజాన్ డెలివరీ సర్వీస్ పార్టనర్‌గా ఇది సంతృప్తికరమైన అనుభవం. అమెజాన్ మద్దతుతో, మేము అత్యంత సమర్థవంతమైన కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసాము. ఇది మేము ప్రస్తుతం నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాలలో మా వినియోగదారులకు మంచి సేవలందించేందుకు మాకు అవకాశం కల్పించింది. నేను అమెజాన్‌తో వృద్ధిని కొనసాగించాలనుకుంటున్నాను. రానున్న 2 నుంచి 3 ఏళ్లలో భారతదేశంలోని ఇతర భౌగోళిక స్థానాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను’’ అని తెలిపారు.