బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 మే 2024 (21:38 IST)

కాంపాక్ట్ ఏ4 కలర్ మల్టీఫంక్షనల్ ప్రింటర్- 4కె ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్‌ను ఆవిష్కరించిన షార్ప్

Sharp Printer
తమ అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులు, పరిష్కారాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన షార్ప్ కార్పొరేషన్ జపాన్ యొక్క పూర్తి యాజమాన్యంలోని భారతీయ అనుబంధ సంస్థ, షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రోజు తమ నూతన కాంపాక్ట్ కలర్ మల్టీఫంక్షనల్ ప్రింటర్, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డును విడుదల చేసినట్లు వెల్లడించింది. వ్యాపారాలను మరింత విజయవంతం చేసేందుకు రూపొందించబడిన ఈ అత్యాధునిక ఆవిష్కరణలు, వ్యాపార ఉత్పాదకతను పెంపొందించడమే కాకుండా ఏ కార్యస్థలానికైనా చక్కదనాన్ని అందిస్తాయి. కొత్త కాంపాక్ట్ MFP ఏ కార్యాలయంలోనైనా సజావుగా కలిసిపోగలదు. A3 కలర్ మల్టీఫంక్షన్ ప్రింటర్‌ల యొక్క హై-ఎండ్ సామర్థ్యాలను అందించగలదు. పూణెలో జరిగిన నేషనల్ డీలర్స్ మీట్‌లో  కొత్తగా విడుదల చేసిన ఉత్పత్తులను షార్ప్ ఆవిష్కరించింది.
 
ఈ ఆవిష్కరణపై షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒసాము నరిటా మాట్లాడుతూ, “వర్క్‌స్పేస్ టెక్నాలజీ యొక్క ప్రపంచవ్యాప్త పరిణామాన్ని ముందుకు నడపడానికి షార్ప్‌ వద్ద మేము ఎల్లప్పుడూ ఆవిష్కరణలను చేస్తూనే వుంటాము. నాణ్యతపై ప్రధానంగా దృష్టి సారించడంతో పాటుగా, పనితీరు పరంగా నూతన ప్రమాణాలను నిర్దేశించడానికి మేము మా స్మార్ట్, కనెక్ట్ చేయబడిన, సురక్షితమైన, వినియోగదారు-స్నేహపూర్వక ఉత్పత్తి శ్రేణిని స్థిరంగా మెరుగుపరుస్తున్నాము. అత్యాధునిక MFP BP-C533WD, అధునాతన 4K అల్ట్రా HD ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్ పరిచయం అత్యాధునిక సాంకేతికతను అసాధారణమైన పనితీరుతో కలపడంలో మా అంకితభావానికి నిదర్శనం, తద్వారా సామర్థ్యం, ఉత్పాదకత కోసం ఆధునిక కార్యాలయాలలో ఒక కొత్త ప్రమాణాన్ని ఏర్పాటు చేయడం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో తమ స్థిరమైన మద్దతు అందిస్తున్న, భారతదేశం వ్యాప్తంగా ఉన్న మా గౌరవనీయ భాగస్వాములకు నేను నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. 
 
ఈ సందర్భంగా శ్రీ సుఖ్‌దేవ్ సింగ్, ప్రెసిడెంట్, స్మార్ట్ బిజినెస్ సొల్యూషన్స్, షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మాట్లాడుతూ, "మా సరికొత్త  శ్రేణిని పరిచయం చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము. తమ కాంపాక్ట్ డిజైన్, అసాధారణమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిన ఏ4 కలర్ మల్టీఫంక్షన్ ప్రింటర్‌లను ప్రదర్శిస్తున్నాము. దీనితో పాటుగా అల్ట్రా హెచ్‌డి 4కె ఇంటరాక్టివ్ వైట్‌బోర్డును ఆవిష్కరిస్తున్నాము. మా వినియోగదారుల ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకోవడంలో మా అంకితభావం, మా ఉత్పత్తి అభివృద్ధి వ్యూహాన్ని ముందుకు తీసుకురావటంలో సహాయపడుతుంది, ఇది అభ్యాస అనుభవాలను మెరుగుపరచడం, ప్రభావవంతమైన ప్రెజెంటేషన్‌లను అందించడం లేదా కార్యాలయంలో గొప్ప సహకారాన్ని పెంపొందించడం వంటివి చేస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి, అవి శక్తివంతం కావటానికి అసాధారణ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి వున్నాము" అని అన్నారు.
 
కొత్త BP-C533WD మల్టీఫంక్షనల్ ప్రింటర్, ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్ PN-LC752, PN-LC862 దేశవ్యాప్తంగా షార్ప్ కార్యాలయాలు, డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి. నూతన MFP ప్రారంభ ధర రూ. 2,72,500 కాగా ఇంటరాక్టివ్ వైట్‌బోర్డ్ ధరలు రూ. 4,92,500 వద్ద ప్రారంభమవుతాయి.