సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 22 జూన్ 2024 (23:08 IST)

ప్రముఖ బ్రోకరేజీల నుండి బలమైన మద్దతును అందుకున్న స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ ఐపిఓ

image
దేశీయంగా అభివృద్ధి చెందిన సూపర్-ప్రీమియం, లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఓ) కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ల నుండి "సబ్‌స్క్రైబ్" రేటింగ్‌ను అందుకుంది, ఇది బిడ్డింగ్ మొదటి రోజున పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేయబడటానికి దారితీసింది, ఇది కంపెనీ బ్రాండ్, లగ్జరీ ఫర్నిచర్ మార్కెట్లో దాని వృద్ధి సామర్థ్యంపై పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది. 
 
విశ్లేషకులు ప్రధానంగా ఈ ఐపిఒ గురించి వెల్లడించిన ప్రధాన అంశాలలో స్టాన్లీ లైఫ్‌స్టైల్స్ యొక్క బలమైన వ్యాపార నమూనా ఒకటి కాగా విభిన్న ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో మరొకటిగా నిలిచింది. సోఫాలు, ఆర్మ్ చైర్స్, కిచెన్ క్యాబినెట్‌లు, బెడ్‌లు, పరుపులు, దిండ్లు వంటి అనేక రకాల గృహ పరిష్కారాలతో పాటుగా విస్తృత శ్రేణి లగ్జరీ ఫర్నిచర్ వస్తువులను కంపెనీ అందిస్తుంది. దీని కస్టమర్లు 300 కంటే ఎక్కువ రంగుల్లో ఉన్న 10 రకాల లెదర్స్, ఫ్యాబ్రిక్స్ నుండి ఎంచుకోవచ్చు.
 
2023 ఆర్థిక సంవత్సరంలో రాబడి పరంగా భారతదేశంలోని గృహోపకరణాల విభాగంలో స్టాన్లీ నాల్గవ అతిపెద్ద సంస్థగా నిలిచింది. సూపర్-ప్రీమియం, లగ్జరీ ఫర్నిచర్ విభాగంలోకి ప్రవేశించిన మొదటి కొన్ని భారతీయ కంపెనీలలో ఇది ఒకటి. వివిధ రంగాలలో వివిధ ధరల వద్ద, అంటే, సూపర్-ప్రీమియం, లగ్జరీ, అల్ట్రా-లగ్జరీ సెగ్మెంట్లో తమ వివిధ బ్రాండ్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని భారతీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. 
 
గత కొద్ది సంవత్సరాలుగా, ఈ బ్రాండ్ అమ్మకాల-కేంద్రీకృత మోడల్ నుండి డిజైన్- ఆధారిత సంస్థగా అభివృద్ధి చెందింది. గృహ పరిష్కారాల యొక్క సమగ్ర ప్రదాతగానూ మారింది. విస్తృత శ్రేణిలో సోఫాలు, ఆర్మ్ చైర్స్, కిచెన్ క్యాబినెట్‌లు, పడకలు, పరుపులు, దిండ్లు వంటి అనేక రకాల గృహ పరిష్కారాలను అందించే ఏకైక సూపర్-ప్రీమియం, లగ్జరీ భారతీయ బ్రాండ్‌గా ఇది నిలిచింది.
 
అంతేకాకుండా, 'స్టాన్లీ లైఫ్‌స్టైల్స్' స్థిరమైన రాబడి వృద్ధిని, ఆరోగ్యకరమైన మార్జిన్‌లను, సమర్థవంతమైన వ్యయ నిర్వహణను ప్రదర్శించింది, ఇది దాని కార్యాచరణ నైపుణ్యం, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రముఖ బ్రోకరేజీలు తమ ఐపిఒ నోట్‌లో "భారతదేశంలో ఒక ప్రముఖ సూపర్-ప్రీమియం, లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ అయిన స్టాన్లీ లైఫ్‌స్టైల్స్(ఎస్ఎల్ఎల్), దాని ఐపిఒకు సంబంధించి బహుళ బ్రోకరేజ్ సంస్థల నుండి మొత్తం సానుకూలమైనప్పటికీ, జాగ్రత్త ఆమోదం పొందింది. కంపెనీ యొక్క గణనీయమైన మార్కెట్ ఉనికి, బలమైన రాబడి వృద్ధి, లాభదాయకతను వారు ప్రశంసించారు. దాని బలమైన బ్రాండ్ అప్పీల్, వినూత్నమైన డిజైన్, వర్టికల్ ఇంటెగ్రేషన్ పరంగా ఎస్ఎల్ఎల్ ప్రసిద్ధి చెందింది" అని వెల్లడించాయి.