మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (13:50 IST)

క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ... బ్యాంక్ సీఈవో రాజీనామా

tmb md krishnan
తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇటీవల ఈ బ్యాంకు‌లో అకౌంట్ కలిగిన క్యాబ్ డ్రైవర్ ఖాతాకు ఉన్న ఫళంగా రూ.9 వేల కోట్లు జమయ్యాయి. దీంతో తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకుల్లో పొరపాటు ఈ లావాదేవీ జరిగింది. వారం క్రితం క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9 వేల కోట్లు జమ అయింది. ఆ తర్వాత అరగంటలోనే తిరిగి ఉపసంహరించుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్.కృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. 
 
తన పదవీకాలం ఇంకా రెండొంతులు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. గత 2022 సెప్టెంబరు నెలలో తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు ఎండీ, సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా, తన రాజీనామా పత్రాన్ని బ్యాంకు బోర్డుకు సమర్పించగా, ఆ వెంటనే ఆమోదించడం కూడా జరిగిపోయింది. అయితే, భారత రిజర్వు బ్యాంకు నుంచి సూచనలు అందేంత రకు ఆయన ప్రస్తుత పదవుల్లో కొనసాగుతారని టీఎంబీ బోర్డు స్పష్టం చేసింది. 
 
కాగా, చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్‌ బ్యాంకు ఖాతాకు ఉన్నఫళంగా రూ.9 వేల కోట్లు పొరపాటు జమ అయ్యాయి. అది చూసిన రాజ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. దాన్ని నిజం అని నమ్మకుండా స్కామ్ అని భావించాడు. ఇది నిజమా లేక నకిలీయా అని తెలుసుకుందామని తన స్నేహితుడికి రూ.21 వేలు బదిలీ చేశాడు. ఈ బదిలీ కూడా సాఫీగానే సాగిపోయింది. ఓ అరగంట తర్వాత జరిగిన పొరపాటును బ్యాంకు అధికారులు గుర్తించి, రాజ్‌ కుమార్ ఖాతా నుంచి జమ అయిన మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇపుడు ఎస్.కృష్ణన్ తన పదవికి రాజీనామ చేయడం గమనార్హం.