శుక్రవారం, 13 జూన్ 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 జూన్ 2025 (23:28 IST)

ఆల్-ఇన్-వన్ ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ను ఆవిష్కరించిన టాటా అసెట్ మేనేజ్‌మెంట్

Hemant
యూజర్లు తమ ఆర్థిక ప్రపంచ సమగ్ర ముఖచిత్రాన్ని ఒకే చోట చూసుకునే వీలు కల్పించే లక్ష్యంతో టాటా అసెట్ మేనేజ్‌మెంట్ సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ఈ తరహా యాప్‌లలో ఇదే మొట్టమొదటిది. ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాంగా తీర్చిదిద్దిన ఈ యాప్ సరళంగా, స్మార్ట్‌గా, వ్యక్తిగతీకరించుకునే విధంగా ఉంటుంది. “వన్ యాప్.వన్ వ్యూ.ఇన్ఫినిట్ ఆపర్చూనిటీస్” అనే బ్రాండ్ ప్లాట్‌ఫాం కింద ఇది రూపొందించబడింది.
 
పెట్టుబడుల ప్రక్రియను మరింత సరళంగా, స్మార్ట్‌గా, అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దే దిశగా ఈ మొబైల్ యాప్ ఆవిష్కరణ ఒక కీలక ముందడుగులాంటిది. బ్రాండ్ ఇచ్చే “వన్ యాప్. వన్ వ్యూ. ఇన్ఫినిట్ ఆపర్చూనిటీస్” (One App. One View. Infinite Opportunities) హామీతో, నేర్చుకోవడం, పెట్టుబడులు పెట్టడం నుంచి తమ ఆర్థిక లక్ష్యాలన్నింటినీ ఒకే చోట ట్రాక్ చేసుకునే వరకు ఇన్వెస్టర్లకు అవసరమైనవన్నీ ఈ యాప్ అందిస్తుంది.
 
తమ బ్రాండ్ హామీకి అనుగుణంగా కొత్తగా ఆవిష్కరించిన యాప్ అనేది టాటా అసెట్ మేనేజ్‌మెంట్ డిజిటల్ పరివర్తనలో కీలక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఏడాది తొలినాళ్లలో ఆవిష్కరించిన సరికొత్త లోగో, బ్రాండ్ ఐడెంటిటీకి ఇది కొనసాగింపుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మారిపోతున్న డిజిటల్ ప్రపంచంలో నేటి ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా సేవలందించాలన్న కంపెనీ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.
 
లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు, ట్రాక్ చేసుకునేందుకు ఈ యాప్‌లో ఫైనాన్షియల్ రోడ్‌మ్యాప్(Financial Roadmap); మ్యుచువల్ ఫండ్స్, ఈక్విటీ, బ్యాంక్ ఖాతాలను ఒకే చోట చూసుకునేందుకు పోర్ట్‌పోలియో360 (Portfolio 360); త్వరితగతిన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఫైర్ కాల్‌క్యులేటర్ (FIRE Calculator); పెట్టుబడుల ఎంపికలను సేవ్ చేసుకునేందుకు, పెట్టుబడుల ప్రక్రియను సరళంగా, సురక్షితంగా మార్చేందుకు స్మార్ట్ కార్ట్(Smart Cart)లాంటి ఫీచర్లు ఉన్నాయి. ఇన్వెస్టర్లకు అడుగడుగునా మార్గదర్శకత్వం వహించేందుకు లెర్నింగ్ మాడ్యూల్స్, చాట్‌బాట్‌ సపోర్ట్ కూడా ఉంటుంది.
 
“వన్ యాప్.వన్ వ్యూ. ఇన్ఫినిట్ ఆపర్చూనిటీస్ అనేది కేవలం ఒక ట్యాగ్‌లైన్ కాదు; మేము అందించే సేవలకు పునాదిలాంటిది. ఒకే వేదికలో తమ ఫైనాన్షియల్ అసెట్స్‌పై మరింత స్పష్టత, నియంత్రణను ఇచ్చే ఇంటెలిజెంట్ ప్లాట్‌ఫాంను నేటి ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు. యూజర్లు ఆత్మవిశ్వాసంతో ఇన్వెస్ట్ చేసేలా నిరాటంకమైన ట్రాకింగ్, వన్ వ్యూ పోర్ట్‌ఫోలియో, వ్యక్తిగతీకరించిన అనుభూతి, ఇలా అన్నింటినీ ఒకే చోట అందిస్తుంది ఈ యాప్. కొత్త ఆవిష్కరణలపై మాకున్న నిబద్ధతను ఇది ప్రతిఫలిస్తుంది. అదేసమయంలో మరింత సరళంగా, స్మార్ట్‌గా, అందరూ ఆచరించగలిగే విధంగా సంపద సృష్టికి దోహదపడుతుంది” అని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిజిటల్ ఆఫీసర్ హేమంత్ కుమార్ తెలిపారు.
 
ఈ డిజిటల్ పరివర్తన, కొత్త లుక్‌తో టాటా అసెట్ మేనేజ్‌మెంట్ నవతరం ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా సేవలు అందిస్తూనే విశ్వసనీయతలో తన సుసంపన్న వారసత్వాన్ని మరింత పటిష్టపర్చుకోవడాన్ని కొనసాగిస్తుంది. ఈ యాప్‌ను యాప్ స్టోర్ మరియు గూగుల్ ప్లే నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.