1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 16 సెప్టెంబరు 2023 (22:11 IST)

ప్రీమియం డిజైన్, అత్యుత్తమ టెక్ ఫీచర్లతో కొత్త జెన్ నెక్సాన్‌ను ఆవిష్కరించిన టాటా మోటార్స్

Nexon
భారతదేశ ప్రముఖ ఆటోమోటివ్ తయారీసంస్థ అయిన టాటా మోటార్స్, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ అయిన సరికొత్త నెక్సాన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటిం చింది. బహుముఖ ప్రజ్ఞ, ఆకాంక్ష, ఆవిష్కరణల స్వరూపంగా కొత్తతరం నెక్సాన్ అన్ని వాహనాలపై సమగ్రమైన అప్‌గ్రేడ్‌ను అందిస్తుంది. కాంపాక్ట్ ఎస్ యూవీ మార్కెట్‌లో గణనీయమైన ప్రగతిశీలతను ఇది గుర్తిస్తుంది, సూచిస్తుంది. ఒక యాక్షన్, ఎమోషన్‌గా వర్ణించబడిన నెక్సన్ అందరికంటే ముందు ఉండాలనుకునే, మరింత సాధించేందుకు సిద్ధంగా ఉండాలని ఆలోచించే వ్యక్తులలో తన నిజమైన ప్రేరణను పొందుతుంది. కొత్త నెక్సన్ తన డిజిటల్ ప్రేరేపిత డిజైన్‌తో దేశవ్యాప్తంగా అన్నితరాల వారిని ఆకట్టుకుంటుంది. ఈ విభాగంలోనే అగ్రశ్రేణి భద్రత, సమకాలీన సాంకేతికత, అత్యుత్తమ తరగతి పనితీరును కలిగిఉంటుంది. ఫియర్‌లెస్, క్రియేటివ్, ప్యూర్, స్మార్ట్ అనే నాలుగు క్రాఫ్ట్ఫుల్‌ క్యూరేటెడ్ రకాల్లో పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్‌లలో అందుబాటులో ఉంది. కొత్త నెక్సన్ అమ్మకాలు ఈరోజు రూ. 8.09 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభమవుతాయి.
 
కొత్త జెన్ నెక్సన్‌ను ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ, "నెక్సాన్ బ్రాండ్ నాయకత్వం వారసత్వాన్ని నిర్మించింది. తన విభాగంలో అత్యుత్తమమైంది. ఇతరులు అనుసరించడానికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది. భారతీయ రహదారులపై 5 లక్షలకు పైగా వాహనాలు నెక్సాన్ నేమ్‌ప్లేట్‌తో నడుస్తున్నాయి. మాస్ అప్పీల్, ఆకాంక్షలతో కూడిన దీని ప్రత్యేక సమ్మేళనం అసాధారణమైనది. కొత్త జెన్ నెక్సన్ మా కస్టమర్‌లు దేని కోసం కోరుకుంటున్నారనే దానిపై మా అవగాహ నకు ధైర్యమైన ప్రాతినిధ్యం. వాహనంలోని ప్రతి అంశం, డిజైన్ నుండి పనితీరు వరకు, భద్రత నుండి సాంకేతికత వరకు, ఫీచర్లు, సౌలభ్యం కొత్త శిఖరాగ్రానికి ఉన్నతీకరించబడ్డాయి. ఇది ఎప్పటికీ కొత్తగా ఉండాలనే మా తాత్వికత నిబద్ధతపై నమ్మకమైన ముందడుగును సూచిస్తుంది. కళాత్మకంగా రూపొందించబడిన వాహనాలు, గొప్ప రంగుల శ్రేణి, విస్తృత ఎంపిక స్మార్ట్ ఫీచర్లు విభిన్న జీవనశైలి, బహుళ-పనితీరు అవసరాలకు సజావుగా అను గుణంగా ఉంటాయి. నెక్సన్ ఈ కొత్త అవతారం విస్తృతమైన వినియోగదారులను ఆకర్షిస్తుందని, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్ యూవీ తన వారసత్వాన్ని మరింత సుసంపన్నం చేసుకుంటుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
 
కొత్త నెక్సన్ మార్కెట్‌లో ప్రత్యేకంగా కనిపించేలా అద్భుతమైన ఫీచర్లు, మెరుగుదలలను కలిగి ఉంది. ఇది ఆధునిక, ప్రీమియం డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రదర్శిస్తుంది. ఇది అధునాతనతను, చైతన్యాన్ని ప్రసరిస్తుంది. రహదారిపై కమాండింగ్ ధోరణి కనబరుస్తుంది. ఇది అత్యాధునిక కనెక్టివిటీ సొల్యూషన్‌లు, అప్‌గ్రేడ్ చేసిన భద్రతా మెరుగుదలలు, లక్షణాలతో అత్యాధునిక ఫీచర్ల శ్రేణితో పూర్తిగా లోడ్ చేయబడింది. ఇది ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. తన విభాగంలో చాలా ముందుంది.