మదుపరులకు గుడ్ న్యూస్.. 1000 పాయింట్ల వద్ద బీఎస్ఈ ర్యాలీ
బాంబే స్టాక్ మార్కెట్ ఈ వారాంతం మదుపరులకు ఉత్సాహాన్నిచ్చింది. శుక్రవారం ప్రారంభంలోనే బాంబే స్టాక్ మార్కెట్ సూచీలు వృద్ధిని గడించాయి. బీఎస్ఈ మధ్యాహ్నం సమయానికి దాదాపు 1000 పాయింట్లు ర్యాలీ చేయడంతో 58,984 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా ఉన్నారు. అలాగే నిఫ్టీ కూడా 180 పాయింట్లు పెరిగి 17,260 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
గత కొన్ని వారాలుగా స్టాక్ మార్కెట్ దారుణంగా పతనమవుతోందని, ముఖ్యంగా అదానీ కంపెనీల షేర్లు పడిపోవడంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారన్న సంగతి తెలిసిందే. ఇకపోతే.. ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, రిలయన్స్ షేర్లు లాభాల బాటపట్టాయి.