సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (18:13 IST)

తెలుగుషాదీ డాట్ కామ్ ‘షాదీ ఉత్సవం’ పోటీతో 10 సంవత్సరాలను వేడుక, బంగారు నాణేల బహుమతులు

shaadi com
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కోసం అతిపెద్ద మ్యాచ్‌మేకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి తెలుగుషాదీ.కామ్. షాదీ.కామ్ గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ తమ 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భాన్ని  పురస్కరించుకుని తమ గ్రాండ్ ‘షాదీ ఉత్సవం’ పోటీని ప్రకటించింది. 14 అక్టోబరు 2024న ముగియనున్న రెండు నెలల వేడుక, ఒక అదృష్టవంతులైన విజేతకు అత్యుత్తమ వివాహ బహుమతిని గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఇది పూర్తి-ప్రాయోజిత వివాహం, దీనికి తెలుగుషాదీ. కామ్ సౌజన్యం అందించనుంది. ఈ మహత్తరమైన సందర్భానికి స్టార్ పవర్‌ను జోడిస్తూ షాదీ. కామ్ ఒక టివిసిని, డిజిటల్ యాడ్ ఫిల్మ్‌ను ఆవిష్కరించింది. ప్రచార ముఖంగా ప్రముఖ నటి సిరి హనుమంతు (బిగ్ బాస్ తెలుగు 5 మరియు జవాన్ ఫేమ్) నటించిన ఈ చిత్రాలు పోటీ యొక్క సారాంశాన్ని అద్భుతంగా ఒడిసి పడతాయి.
 
ఈ పోటీలో పాల్గొనటానికి నియమాలు చాలా సరళంగా ఉంటాయి: చెల్లింపు ప్లాన్‌ని కలిగి ఉన్న లేదా పోటీ కాలంలో చెల్లింపు ప్లాన్‌కు అప్‌గ్రేడ్ చేసే ఏ వినియోగదారు అయినా లక్కీ డ్రాలో పాల్గొనడానికి ఆటోమేటిక్‌గా అర్హులు అవుతారు. తెలుగుషాదీ డాట్ కామ్‌తో తమ కలల వివాహాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా, 20 మంది వినియోగదారులు బంగారు నాణేలను గెలుచుకునే అవకాశం ఉంటుంది.
 
షాదీ.కామ్ మార్కెటింగ్ డైరెక్టర్ మనీష్ ఎం మాట్లాడుతూ, “తెలుగుషాదీ.కామ్ బ్రాండ్‌కు దేశంలోనే ఒక సమగ్ర మార్కెట్. తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన నిర్ణయాన్ని-జీవిత భాగస్వామిని కనుగొనడానికి- ప్లాట్‌ఫారమ్‌కు అప్పగించిన లక్షలాది మంది తెలుగు వినియోగదారులకు కృతజ్ఞతలు  తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడింది. యూజర్‌లు కలల భాగస్వామిని కనుగొనడాన్ని సులభతరం చేయడాన్ని మేము అధిగమించాలనుకోవడంతో పాటుగా తమ కలల వివాహాన్ని చేసుకునేలా చేస్తున్నాము" అని అన్నారు. 
 
సంవత్సరాలుగా, తెలుగుషాదీ. కామ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కోసం అత్యంత విశ్వసనీయమైన మ్యాచ్‌మేకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా మారింది. ఇది వినూత్న కార్యక్రమాల ద్వారా దాని వినియోగదారులను శక్తివంతం చేసింది, లోతైన మరియు శాశ్వతమైన అనుబంధాలను ప్రారంభించింది.