శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (10:45 IST)

దేశంలో పెరిగిన ఇంధన ధరలు... ఏపీలో ఎంతంటే...

దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు అడ్డూఆపూ లేకుండా పెరుగుతూనేవున్నాయి. పెర‌గ‌డం త‌ప్ప త‌గ్గ‌డం తెలియ‌ద‌న్న‌ట్లు దూసుకుపోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్ప‌టికే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర సెంచ‌రీ దాటేసింది. 
 
ఇక ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ఇంకో వారంలో హైద‌రాబాద్‌లోనూ పెట్రోల్ ధ‌ర వంద దాటేలా క‌నిపిస్తోంది. ఇక డీజీల్ కూడా పెట్రోల్‌తో పోటీ ప‌డీ మ‌రీ పెరుగుతోంది. దేశ‌వ్యాప్తంగా సోమవారం ప్ర‌ధాన న‌గ‌రాల్లో న‌మోదైన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై ఓ లుక్కేయండి..
 
దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ రూ.94.76 (ఆదివారం రూ. 94.49), లీట‌ర్ డీజిల్ రూ.85.66 (ఆదివారం రూ.85.38) చొప్పున ఉండగా, ముంబైలో లీట‌ర్ పెట్రోల్ రూ.100.98 (ఆదివారం రూ.100.72), లీట‌ర్ డీజిల్ రూ.92.99 (ఆదివారం రూ.92.69)గా ఉంది. 
 
ఇకపోతే, చెన్నైలో సోమ‌వారం ఇంధ‌న ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. లీట‌ర్ పెట్రోల్ రూ.96.23 (ఆదివారం రూ.96.08 ), లీట‌ర్ డీజిల్ రూ.90.38 (ఆదివారం రూ. 90.21), హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ రూ.98.48 (ఆదివారం రూ.98.20), లీట‌ర్ డీజిల్ రూ.93.38 (ఆదివారం రూ.93.08), విజ‌య‌వాడ‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 100.89 (ఆదివారం రూ.100.73) లీట‌ర్ డీజిల్ రూ.95.19 (ఆదివారం రూ.95) చొప్పున ఉంది.