సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (23:46 IST)

ఐసీఓటీవై 2023లో కియాకు గొప్ప ప్రశంశలు: ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ గెలుపొందిన కారెన్స్

దేశంలోనే అతి వేగంగా పెరుగుతున్న కారు తయారీదారులలో ఒకటి కియా ఇండియా, ICOTY 2023లో గొప్ప విజయాలు సాధించింది. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) 2023గా కియా కారెన్స్‌కు గౌరవం దక్కింది మరియు కియా ఈవీ6 గ్రీన్ కార్ అవార్డ్ 2023ని ICOTY ద్వారా గెలుచుకుంది. దీనితో, ఒకే సంవత్సరంలో రెండు ICOTY అవార్డ్స్ గెలుపొందిన మొదటి బ్రాండ్ గా కియా గుర్తింపు పొందింది.
 
ఆటోమోటివ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AJAI) ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా ICOTY అవార్డ్స్ నిర్వహించబడుతున్నాయి. ఇవి దేసంలోనే అత్యంత గొప్ప ఆటోమోటివ్ అవార్డ్స్‌గా పేరు పొందాయి. భారతదేశపు ఆటోమోటివ్ పరశ్రమకు ఆస్కార్స్‌గా కూడా సూచించబడతాయి. అవార్డ్ అనేది నిపుణుల మరియు ఉత్తమమైన కొత్త కారు గురించి స్వతంత్రమైన నిర్ణయం. అత్యంత అనుభవం గల జ్యూరీ సభ్యులు ఏక నిర్ణయం విజేతను ఎంచుకోవడానికి బాధ్యులు. విజేతను నిర్ణయించే సమయంలో ధర, ఇంధన సామర్థ్యం, స్టైలింగ్, సౌకర్యం, భద్రత, పనితీరు, ఆచరణీయత, సాంకేతిక నవ్యత, డబ్బుకు తగిన విలువ మరియు భారతదేశపు డ్రైవింగ్ పరిస్థితులు కోసం అనుకూలత వంటి ప్రమాణాలను ముఖ్యమైన అంశాలుగా పరిగణన చేస్తారు.
 
టే-జిన్ పార్క్, మేనేజింగ్ డైరక్టర్ & సీఈఓ, కియా ఇండియా ఇలా అన్నారు, "కియా కుటుంబంలో మా అందరికి ఇది గర్వించదగిన క్షణం. కేవలం ఒకటి కాదు రెండు ప్రతిష్టాత్మకమైన ICOTY గౌరవాలు - కియా కారెన్స్ గొప్ప 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్' గెలుచుకుంది. మా ఫ్లాగ్ షిప్ ఈవీ, ద ఈవీ6 ICOTY' ఐసీఓటీవై ద్వారా గ్రీన్ కార్ అవార్డ్ 2023' గా ప్రశంశ అందుకుంది. ఈ గుర్తింపు కోసం మా గౌరవనీయమైన ICOTY జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ఇది కియా బ్రాండ్‌కు ఎంతో అర్హమైన గుర్తింపు మరియు మా సాంకేతిక పరాక్రమం, సామర్థ్యాలు మరియు భారతదేశపు మార్కెట్‌ను అర్థం చేసుకోవడం గురించి ఇది ఎంతగానో చెబుతుంది. ఇది భారతదేశంలో మా విజయ యాత్రకు ఫలితం మరియు పని చేస్తూ ఉండటానికి మరియు ప్రేరేపిత భవిష్యత్తు దిశగా తోడ్పడటానికి పని చేస్తూనే ఉండటానికి ఇది మాకు ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తుంది."