బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 నవంబరు 2022 (21:14 IST)

‘అబద్దాలు చెప్పని ఆహారం’: ట్రూ ఎలిమెంట్స్ సంచలనాత్మక నూతన క్యాంపెయిన్

food
భారతదేశ మొట్ట మొదటి క్లీన్ లేబుల్, 100% హోల్ గ్రెయిన్ సర్టిఫైడ్ ఫుడ్ బ్రాండ్ అయిన ట్రూఎలిమెంట్స్ ఎలాంటి పదాల మాయాజాలం, రసాయనాలు, నిల్వకారకాలు లేదా యాడెడ్ షుగర్ లేకుండా 100% రుచిని అందిస్తామన్న వాగ్దానంపై నిర్మించబడింది, ‘అబద్దం చెప్పని ఆహారాన్ని’ అందిస్తోంది. ఇప్పుడు ఈ బ్రాండ్ తాత్వికతను చాటిచెప్పేలా ట్రూ ఎలిమెంట్స్ తన మొట్టమొదటి క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఈ వినూత్న క్యాంపెయిన్ నాలుగు సంబంధిత ఫిల్మ్స్‌ను హాస్యభరితంగా అందిస్తోంది. సానిక్, ఎఎస్ఎంఆర్ ఫండమెంటల్స్ పైన నిర్మించబడిన, మనస్సులో ఎప్పటికీ నిలిచిపోయేవిగా ఇవి రూపుదిద్దుకున్నా యి. ఒకసారి చూస్తే మళ్లీ మళ్లీ ఈ బ్రాండ్ ను గుర్తు చేసేవిగా ఈ బ్రాండ్‌కు విలక్షణ గొంతుకను అందిస్తాయి.
 
మార్కెట్లో లభించే ప్యాకేజ్డ్ ఫుడ్‌లో అత్యధిక శాతం వాటిలో, దీర్ఘకాలిక షెల్ప్ లైఫ్ కోసం లేదా మెరుగు పర్చబడిన రుచి కోసం అనారోగ్యకరమైన అడిటివ్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే అర్థసత్యాల ప్రకటనలతో తమను తాము ఆరోగ్యదాయకాలుగా చాటుకుంటూ ఉంటాయి. కొనుగోలుదారులు తెలివైనవారని, ఒక బ్రాండ్ అబద్దం చెబితే దాన్ని మార్చివేస్తారనే ట్రూ ఎలిమెంట్ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లేది ఈ అంశమే. ఈ అంశం ఆధారంగా రూపుదిద్దుకున్న ట్రూ ఎలిమెంట్ క్యాంపెయిన్, అబద్దాలు చెప్పడం నుంచి నిజం చెప్పడం దాకా అటూ ఇటూ మారడం ఇందులో ప్రధానాంశంగా ఉంటుంది.
 
అందులోనే క్లీన్ లేబుల్ సర్టిఫైడ్ రోల్డ్ ఓట్స్, నట్స్ అండ్ బెర్రీస్ మ్యూస్లి, 7-ఇన్-1 సీడ్స్ మిక్స్ ఉత్పాదనలను ప్రముఖంగా చూపిస్తుంది. ఈ నాలుగు ఎంగేజింగ్ ఫిల్మ్స్‌లో రెండు 30 సెకన్ల నిడివితో, మరో రెండు 10 సెకన్ల నిడివితో ఉంటాయి. మనస్సులో నాటుకు పోయే ‘ట్రూయింగ్ ట్రూయింగ్, వాట్ యూ డూయింగ్’ అనే క్యాచీ ఇయర్ వామ్ వీటి స్టోరీ టెల్లింగ్ ను మరింత శక్తివంతం చేస్తుంది.
 
30 సెకన్ల నిడివి ఉండే రెండు ఫిల్మ్ లు కూడా బ్రేక్ ఫాస్ట్ లాంటి మనకు జీవితంలో ఎదురయ్యే సాధారణ సంద ర్భాల పైనే రూపుదిద్దుకున్నాయి. అబద్దం చెప్పినప్పుడు ఆయా పాత్రలు ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుపోవడం ఇందులో చూడవచ్చు. వారు ట్రూ ఎలిమెంట్స్ ను కాస్త తినగానే అస లైన నిజం బయటకు వస్తుంది. అబద్దం చెప్పని ఆహారంతో, దాన్ని తిరువాత ఆయా పాత్రలు అబద్దం చెప్పక పోవడాన్ని ఇవి ప్రదర్శిస్తాయి.