గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (18:05 IST)

పేటీఎం తరహాలో వాట్సాప్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్

ఆన్‌లైన్ పేమెంట్ల దిగ్గ‌జం పేటీఎం ఇప్పటికే చిన్న‌, మ‌ధ్య‌స్థ వ్యాపారుల‌కు సౌల‌భ్యం కోసం ''పేటీఎం ఫ‌ర్ బిజినెస్'' యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఇదే తరహాలో సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ బిజినెస్

ఆన్‌లైన్ పేమెంట్ల దిగ్గ‌జం పేటీఎం ఇప్పటికే చిన్న‌, మ‌ధ్య‌స్థ వ్యాపారుల‌కు సౌల‌భ్యం కోసం ''పేటీఎం ఫ‌ర్ బిజినెస్'' యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

ఇదే తరహాలో సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ బిజినెస్ యాప్ ప్రస్తుతం భారత్‌లోనూ అందుబాటులోకి రానుంది. భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఈ వాట్సాప్ బిజినెస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 
 
ఆండ్రాయిడ్ ఫ్లాట్‌ఫామ్‌పై గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వ్యాపారస్తులు ఎవరైనా సరే దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని తమ ఖాతాదారులతో నేరుగా టచ్‌లో ఉండొచ్చు. తద్వారా సులభంగా ట్రాన్సాక్షన్లు జరుపుకోవచ్చు. వాట్సాప్‌ లాగానే ఈ బిజినెస్‌ యాప్‌ కూడా కాల్స్‌, మెసేజ్‌లను థర్డ్‌పార్టీకి చేరకుండా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను ఆఫర్‌ చేస్తోంది.