సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 జులై 2016 (12:41 IST)

డబ్బు కోసం పనిచేస్తున్నారా? ఐతే కష్టమే.. జీతం తక్కువైనా నచ్చిన కెరీర్ ఎంచుకోండి!

ఉద్యోగం చేయడం అనేది ప్రస్తుతం తప్పనిసరి అయ్యింది. ఏదోక ఉద్యోగం చేసుకుంటూ పోతే పోలా.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే డబ్బేగా ముఖ్యం.. అన్నట్లు ముందుకెళ్తే మాత్రం చిక్కుల్లో చిక్కుకున్నట్లే. డబ్బు కోసం కాక

ఉద్యోగం చేయడం అనేది ప్రస్తుతం తప్పనిసరి అయ్యింది. ఏదోక ఉద్యోగం చేసుకుంటూ పోతే పోలా.. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే డబ్బేగా ముఖ్యం.. అన్నట్లు ముందుకెళ్తే మాత్రం చిక్కుల్లో చిక్కుకున్నట్లే. డబ్బు కోసం కాకుండా కెరీర్ కోసం పనిచేయడం మంచిది. డబ్బు కోసం పనిచేస్తే ఆ ఉద్యోగంలో ఆసక్తి తగ్గుతుంది. అదే నచ్చిన కెరీర్‌ను ఎంచుకుని.. కష్టపడి పనిచేస్తే.. జీతం తక్కువైనా మంచి గుర్తింపు.. పోను పోను మంచి డబ్బూ సంపాదించవచ్చునని నిపుణులు అంటున్నారు. 
 
అవసరాలకు ఉద్యోగం చేయాలి. అదే చేస్తున్న పని నచ్చితే ఆ రంగంలో రాణించడం సులభమవుతుంది. అలాకాకుండా కేవలం సంపాదన కోసం జాబ్ చేస్తే.. కెరీర్‌లో ఎదుగుదల ఉండదు. తద్వారా మానసికంగా ఒత్తిడి తప్పదు. నచ్చిన కెరీర్‌ను ఎంచుకోవడం ఉద్యోగాన్నే కాదు, జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. నచ్చిన వృత్తిలో ప్రవేశించిగలిగితే ఒకవేళ, అందులో ఏవైనా సమస్యలున్నా అంతగా బాధించవు.
 
అదే వృత్తి, ఉద్యోగం నచ్చకపోతే దాని ప్రభావం వ్యక్తిగత జీవితంపైనా పడుతుంది. ఉద్యోగం అన్నాక అప్పుడప్పుడు సమస్యలు ఎలాగూ తప్పవు. కానీ ప్రతిరోజూ సమస్యగా అనిపించినా, మీ నైపుణ్యాలకు పొంతన లేకుండా ఉన్నా ఉద్యోగంలో రాణించలేరు. కాబట్టి జీతం తక్కువైనా కెరీర్‌ను ఎంచుకుని కష్టమైనా ఇష్టపడి పనిచేయండి.