శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 24 మే 2024 (18:39 IST)

ఎడ్‌టెక్ లీడ్‌‌లో సిబిఎస్‌ఇ టెన్త్ పరీక్షలో 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థులు 80 శాతం

girl
భారతదేశంలోని ప్రముఖ స్కూల్ ఎడ్‌టెక్ లీడ్‌‌కు చెందిన 10వ తరగతి విద్యార్థుల 2024 సంవత్సరపు బ్యాచ్, సిబిఎస్‌ఇ బోర్డు పరీక్ష ఫలితాల్లో అపూర్వ ఫలితాలను సాధించింది. గతేడాది 90 మంది విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించగా, ఈ ఏడాది 161 మంది లీడ్ విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించారు. లీడ్ పాఠశాలలకు వివరణాత్మక పాఠ్య ప్రణాళికలు, ఉపాధ్యాయులకు అవసరమైన వనరులు, అభ్యాస పరీక్షలు, విద్యార్థులకు మాక్ పరీక్షలను నిర్వహించటం ద్వారా బోర్డు పరీక్షలకు సిద్ధం చేస్తుంది. అదనంగా, లీడ్ యాప్ విద్యార్థులకు అపరిమిత అభ్యాస అవకాశాలను అందిస్తుంది, వారి పరీక్షకు సిద్ధం కావటంలో మరింతగా మద్దతు ఇస్తుంది.
 
సంగారెడ్డిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌కు చెందిన గైని అక్షయ, రాచపూడి శ్రీచార్వి మోహన నివేదిత, లాడే సర్వేష్ కుమార్, మందా సాథ్విక్, రెడ్డిగారి శ్రీజ వరుసగా 98%, 97%, 96%, 95%, 95% సాధించడం గమనార్హం. అనేక మంది లీడ్ విద్యార్థులు గణితం, సాంఘిక శాస్త్రం, సంగీతం వంటి సబ్జెక్టులలో 100 మార్కులు సాధించారు. 
 
లీడ్ గ్రూప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమీత్ మెహతా మాట్లాడుతూ, "సిబిఎస్‌ఇ 10వ తరగతి బోర్డ్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు 2024 లీడ్ కోహోర్ట్‌కు నా హృదయపూర్వక అభినందనలు. వారి అద్భుతమైన అకడమిక్ విజయం సరైన పాఠశాల విద్యతో, ప్రతి విద్యార్థి తామున్న ప్రాంతం లేదా నేపథ్యంతో సంబంధం లేకుండా రాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారనే మా నమ్మకాన్ని నొక్కి చెబుతుంది. లీడ్ గ్రూప్‌ వద్ద, మేము మా విద్యార్థుల విజయాల పట్ల అపారమైన సంతోషాన్ని పొందుతున్నాము, ఒక సమయంలో ఒక పాఠశాలలో సంపూర్ణ విద్యా పరివర్తనకు కట్టుబడి ఉంటాము" అని అన్నారు. 
 
సంగారెడ్డిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ విద్యార్థి గైనీ అక్షయ మాట్లాడుతూ, “సిబిఎస్‌ఇ 10వ తరగతి బోర్డు పరీక్షలో నా ప్రదర్శన పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది. నా పాఠశాల ఉపాధ్యాయులకు, నా తల్లిదండ్రులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, వారి తిరుగులేని మద్దతు లేకుండా ఈ విజయం సాధ్యం కాదు. లీడ్ బోధనాంశాలు, టీచింగ్-లెర్నింగ్ మెథడాలజీ అన్ని సబ్జెక్టులను బాగా అర్థం చేసుకోవడంలో నాకు సహాయపడింది, కాన్సెప్ట్‌లను మెరుగ్గా అర్ధం చేసుకోవటం వల్ల నా బోర్డ్ పరీక్షలలో మెరుగ్గా రాణించగలిగాను" అని అన్నారు. 
 
సంగారెడ్డిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మహేందర్ జాయ్ మాట్లాడుతూ," సిబిఎస్‌ఇ బోర్డు 10వ తరగతిలో గైనీ అక్షయ, రాచపూడి శ్రీ చార్వి మోహన నివేదిత, లాడే సర్వేష్ కుమార్, మందా సాథ్విక్, రెడ్డిగారి శ్రీజ అద్భుత ప్రతిభ కనబరచడం మాకు ఎంతో సంతోషంగా వుంది. వారి ఆకట్టుకునే ఫలితాలు వారి అంకితభావం, కృషి అలాగే లీడ్ అందించిన విస్తృతమైన విద్యాపరమైన మద్దతు, మార్గదర్శకత్వంని ప్రతిబింబిస్తాయి. లీడ్ యొక్క కఠినమైన 10వ తరగతి ప్రోగ్రామ్, సమగ్ర అభ్యాసం, సమయానుకూల నివారణలకు ప్రాధాన్యతనిస్తూ, సబ్జెక్టులపై విద్యార్థుల కాన్సెప్ట్  అవగాహనను గణనీయంగా పెంచింది, వారు మరింత ఆత్మవిశ్వాసంతో మారడంలో సహాయపడింది." అని అన్నారు.