గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 డిశెంబరు 2020 (20:49 IST)

ఏపీ విద్యార్థులకు శుభవార్త... ఏంటది..?

ఏపీ విద్యార్థులకు శుభవార్త. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌(ఎంసీఏ) కోర్సు వ్యవధిని కుదిస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడేళ్ల కోర్సును రెండు సంవత్సరాలుగా కుదిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సతీష్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
అందుకు సంబంధించిన కరికులంను రూపొందించాలంటూ వీసీలకు ఆదేశాలు జారీ చేసింది. మ్యాథ్స్ చదివిన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్స్‌కు ఎంసీఏ రెండేళ్లు మాత్రమే పరిగణించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీని వల్ల విద్యార్థులకు ఒక ఏడాది ఆదా అవుతుంది. మరోవైపు ఈ విధానాన్ని మహారాష్ట్రలో ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.