కరోనా వైరస్ బారినపడిన ఒంగోలు ఎంపీ!

magunta srinivasulu reddy
ఠాగూర్| Last Updated: సోమవారం, 21 డిశెంబరు 2020 (08:43 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రాజకీయ నేత కరోనా వైరస్ బారినపడ్డారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.

ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన చెన్నైలోని అపోలో దవాఖానలో చేరారు. ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 8,78,285 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,355 కేసులు యాక్టివ్‌గా ఉండగా, మరో 8,66,856 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా వల్ల 7074 మంది మరణించారు. రాష్ట్రంలో నిన్న 479 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.దీనిపై మరింత చదవండి :