బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (20:22 IST)

ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్ఈ విద్యా విధానం అమలు : సీఎం జగన్

రాష్ట్ర ప్రభుత్వం 2021 - 22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
 
ఆయన బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. 
 
దీనికి సంబంధించి ఎఫిలియేషన్‌ కోసం CBSE బోర్డుతో చర్చించి ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్‌ సిలబస్‌ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 
 
ఆంగ్లంపై మరింత పట్టు సాధిస్తే విద్యార్థులు ఎక్కడైనా రాణించే అవకాశం ఉంటుందన్నారు. ఒత్తిడికి గురి కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఇది ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. కాగా, మాతృభాషకు ఏపీ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇపుడు సీబీఎస్ఈ అంశం తెరపైకి తీసుకునిరావడం గమనార్హం.