శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 17 మార్చి 2021 (17:13 IST)

జూన్ 7నుంచి పదో తరగతి పరీక్షలు - మే 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్

రాష్ట్రంలో జూన్ 7వ తేది నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ 2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం విడుదల చేశారు. 
 
జూన్ 7 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నట్లు ప్రకటించారు. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూలై 21వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుందని వెల్లడించారు. 
 
కోవిడ్ నేపథ్యంలో పదో తరగతికి ఈ ఏడాది ఏడు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 7న ఫస్ట్ లాంగ్వేజ్, జూన్ 8న సెకండ్ లాంగ్వేజ్, జూన్ 9న ఇంగ్లీష్, జూన్ 10న మ్యాథమ్యాటిక్స్. జూన్ 11న ఫిజికల్ సైన్స్, జూన్ 12న బయోలాజికల్ సైన్స్, జూన్ 14న సోషల్ స్టడీస్ వుంటుందని తెలిపారు.