శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (13:46 IST)

రేపు ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష - రాష్ట్ర వ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఈసెట్ ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 103 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాకినాడ జేఎన్టీయూ-కే ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌‍ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 
 
ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్, బీఎస్సీ (గణితం) పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఈ పరీక్షలను రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ ఆన్‌లైన్‌లో జరుగుతాయని కన్వీనర్ తెలిపారు. పరీక్షల నిర్వహణకు ఏపీ వ్యాప్తంగా 101, తెలంగాణలో 2 మొత్తం 103 కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.
 
విద్యార్థులు హాల్ టికెట్లను cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. 23న ప్రాథమిక కీ విడుదల చేస్తామని దీనిపై అభ్యంతరాలను 25 వరకూ స్వీకరిస్తామని జూలై మొదటివారంలో ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఒక్క నిమిషం అలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోని అనుమతించబోరని తెలిపారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 8500404562 హెల్ప్ డెస్క్ నంబరులో సంప్రదించాలని సూచించారు.