శుక్రవారం, 8 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (09:59 IST)

ఆసియా కప్ క్రికెట్ టోర్నీ షెడ్యూల్ రిలీజ్ - భారత్ పాక్ మ్యాచ్ ఎక్కడంటే!

asia cricket cup
ఆసియా దేశాల మధ్య జరిగే క్రికెట్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా వెల్లడించింది. ఈ క్రికెట్ టోర్నీ ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబరు 17వ తేదీ వరకు జరుగనుంది. ఆ టోర్నీకి శ్రీలంక, పాకిస్థాన్ జట్లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ దేశంలో నాలుగు మ్యాచ్‌లను నిర్వహిస్తారు. మిగిలిన మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉన్నాయి. 
 
16వ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ జట్లు తలపడతాయి. టోర్నీలో 13 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నీ తొలి దశలో మొత్తం ఆరు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఈ రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-4కు చేరుకుంటాయి. సూపర్-4 దశలో ఈ నాలుగు జట్లలో టాప్-2లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే, భారత్, పాకిస్థాన్ జట్లు ఒకే గ్రూపులో ఉండగా, శ్రీలంక, ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు మరో గ్రూపులో ఉన్నాయి.