1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (08:50 IST)

ఆధార్‌లో ఉచిత మార్పులు - చేర్పులకు గడువు నేటితో పూర్తి

aadhaar card
ఆధార్ కార్డులో దొర్లిన తప్పులకు ఉచితంగా మార్పులు, చేర్పులు చేసుకునేందుకు నిర్ణయించిన గడువు జూన్ 14వ తేదీ బుధవారంతో ముగియనుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్‍డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును ఉడాయ్ కల్పించింది. 
 
మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సుదపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్చి 15వ తేదీ నుంచి ఇది అందుబాటులో ఉంది. అయితే, ఈ ఫ్రీ అప్‌‍డేట్ గడువు జూన్ 14వ తేదీతో ముగియనుంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఆధార్ అప్‌డేట్ కోసం రూ.50 రుసుం చెల్లించాల్సివుంటుంది. https://myaadhaar.uidai.gov.in పోర్టల్‌లోకి వెళ్ళి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్ మొబైల్ నంబర్ సాయంతో లాగిన్ కావాల్సి ఉంటుంది అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ధేశిత పత్రాలు జతచేయాల్సి ఉంటుంది.