1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (18:58 IST)

రాష్ట్ర సమాచార కమీషనర్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్(APIC)లో ఖాళీగా ఉన్న రెండు రాష్ట్ర సమాచార కమీషనర్ల పోస్టుల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(జిపిఎం అండ్ ఎఆర్) కె.ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 2017 ఆగష్టు 16వ తేదీన ఏర్పాటు చేయబడిన ఆంధ్రప్రదేశ్ సమాచార కమీషన్ (AP Information Commission)(APIC)లో ప్రస్తుతం ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమీషనర్,మరో ఐదుగురు స్టేట్ ఇన్పర్మేషన్ కమీషనర్లు పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 
 
కాగా రాష్ట్ర సమాచార కమీషన్లో ఖాళీగా ఉన్నమరో రెండు రాష్ట్ర సమాచార కమీషనర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని కావున ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆయన తెలియజేశారు. ధరఖాస్తులను ఈ నెల 23వతేదీ సా.5గం.లలోగా రిజిష్టర్ పోస్టులోగాని లేదా వ్యక్తిగతంగా గాని సెక్రటరీ, APIC,1మొదటి అంతస్తు,ఎంజిఎం క్యాపిటల్,(near)ఎన్ఆర్ఐ వై జంక్షన్, చిన కాకాని గ్రామం,మంగళగిరి-522508, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే చిరునామాకు చేరే విధంగా పంపాల్సిందిగా ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. 
 
మరిన్ని వివరాలకై ఎం.ధామస్ మార్టిన్ సూపరింటిండెంట్, APIC (మొబైల్ నంబరు +91 8639376125)ను సంప్రదించవచ్చని తెలియజేశారు. అంతేగాక ధరఖాస్తుదారులు 2005 సమాచార హక్కు చట్టం అమెండ్మంట్ బై ది రైట్ టు ఇన్పర్మేషన్ (అమెండ్మెంట్) యాక్టు,2019 రెడ్ విత్ ది రైట్ టు ఇన్పర్మేషన్ రూల్స్,2019 లోని సెక్షన్ 15 మరియు 16లను చూడవచ్చని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.