బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 మే 2023 (09:52 IST)

బీడీఎల్‌లో ఉద్యోగాలు... నోటిఫికేషన్ జారీ

Jobs
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంతో పాటు విశాఖపట్టణం, బెంగుళూరు, భానూర్, కొచ్చి, ముంబై కార్యాలయాల్లో ఉన్న వంద పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. హెచ్ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో ఉన్న ఖాళలను కాంట్రాక్ట్ విభానంలో భర్తీ చేయనుంది. 
 
వివిధ నగరాల్లోని బీడీఎల్ కార్యాలయాల్లో ప్రాజెక్టు ఇంజనీర్, ప్రాజెక్టు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధింత విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమో, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలోని కనీసం యేడాది అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
 
దరఖాస్తుదారుల వయసు మే 10వ తేదీ నాటికి 28 యేళ్లు మించకుండా ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30 వేల నుంచి రూ.39 వేల వరకు వేతనం చెల్లిస్తారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ మొదలై జూన్ 23వ తేదీతో ముగుస్తుంది. జూలై రెండో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.