గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 12 మే 2023 (14:55 IST)

సీబీఎస్ఈ పరీక్షా ఫలితాలు వెల్లడి - ఎలా తెలుసుకోవాలంటే...

cbse results
పదో తరగతి, 12వ తరగతి పరీక్షా ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం వెల్లడించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులందరికీ మార్కు షీట్‌లు, ఉత్తీర్ణ ధృవీకరణ పత్రాలు డిజి లాకర్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన వారు తమ సీబీఎస్ఈ ఫలితాల డిజిలాకర్ ఖాతాలను యాక్టివేట్ చేయడం ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. తొలుత 12వ తరగతి పరీక్షా ఫలితాలను వెల్లడించిన సీబీఎస్ఈ అధికారులు ఆ తర్వాత పదో తరగతి పరీక్షా ఫలితాలను రిలీజ్ చేశారు. 
 
విద్యార్థులు, తల్లిదండ్రులు తమ డిజిలాకరు ఖాతాలను యాక్టివేట్ చేయడానికి ఆరు అంకెల సెక్యూరిటీ పిన్ అవసరమవుతుంది. డిజి లాకర్‌తో పాటు పరీక్షా సంగమ్ నుంచి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంర్లు, స్కూల్ నంబర్లతో ఈ పరీక్షా ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థులు ఎవరైనా తమ డిజిలాకర్ సెక్యూరిటీ పిన్‌ను పొందినట్టయితే ఇందుకోసం వారు తమ పాఠశాలలను సంప్రదించవలసి ఉంటుంది. 12వ తరగతిలో ఉత్తీర్ణత 87.33 శాతం కాగా, పదో తరగతిలో 93.12 శాతంగా ఉంది.